Pushpa: ఫుల్ స్పీడ్ ప్రమోషన్లు.. పుష్ప ఫీవర్ తెగపెంచేస్తున్న సుక్కు!

సినిమాలు రిలీజ్ కు రెడీ చేసుకుంటున్న ఏ స్టార్ హీరో.. ఏ డైరెక్టర్ కూడా ఈ రేంజ్ లో ప్రమోషన్లు చెయ్యడం లేదు. కానీ సుకుమార్.. బన్నీ మాత్రం పుష్ప సినిమాపై హైప్ పెంచుకుంటూ..

Pushpa: ఫుల్ స్పీడ్ ప్రమోషన్లు.. పుష్ప ఫీవర్ తెగపెంచేస్తున్న సుక్కు!

Pushpa

Pushpa: సినిమాలు రిలీజ్ కు రెడీ చేసుకుంటున్న ఏ స్టార్ హీరో.. ఏ డైరెక్టర్ కూడా ఈ రేంజ్ లో ప్రమోషన్లు చెయ్యడం లేదు. కానీ సుకుమార్.. బన్నీ మాత్రం పుష్ప సినిమాపై హైప్ పెంచుకుంటూ పోతున్నారు. వరుస అప్ డేట్స్ ఇస్తూ.. ఫుల్ దూకుడు చూపిస్తున్నారు. సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచడానికి ఏ అవకాశం వదలట్లేదు సుకుమార్. ఇక ఫైనల్ గా ట్రైలర్ ట్రీట్ తో అదరగొట్టారు.

Bigg Boss 5: హౌస్‌లో మళ్ళీ పింకీ.. మానస్‌కి మస్సాజ్!

పుష్ప దూకుడు పెంచాడు.. పుష్పరాజ్ అసలు తగ్గేదే లేదంటున్నాడు. డిసెంబర్ 17న రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప మూవీకి సంబంధించి ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ ను రిలీజ్ చేసేశారు పుష్ప టీమ్. ప్రజెంట్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఏ పెద్ద సినిమాకీ లేనంత దూకుడు చూపిస్తే.. పుష్ప ఫీవర్ ని తెగపెంచేస్తున్నాడు సుకుమార్. ట్రైలర్ తో బన్నీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టినంత పనిచేశాడు సుకుమార్. సినిమా రేంజ్ లను ఒక్క ట్రైలర్ తో చూపించేశాడు. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన వాటిని పక్కన పెడితే.. ట్రైలర్ తో పుష్ప అంచనాలను అమాంతం పెంచేశాడు సుకుమార్.

Mouni Roy: మౌనీ కిల్లర్ లుక్స్.. ఖేల్ ఖతం అంతే!

ప్రమోషన్ల విషయంలో డిఫరెంట్ గా ప్లాన్ వేస్కుంటున్నారు బన్నీ టీమ్. ఒక రకంగా చెప్పాలంటే ఆడియన్స్ లో పుష్ప ఫీవర్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ , టీజర్స్ తో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగా పెంచేసిన బన్నీ అండ్ టీమ్.. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన చిన్న వీడియోలో సినిమా మీద ఇంకా హైప్స్ పెంచేశారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న పుష్పలో పవర్ ఫుల్ స్టార్ కాస్ట్ తో ఫిల్ చేసిన టీమ్.. వీళ్లకు సంబంధించిన లుక్ తోనే అందరినీ ఆకట్టుకున్నారు. సినిమాకున్న ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ కావడానికి అదే రేంజ్ లో సినిమా నుంచి ఇప్పటికే ఇంట్రస్టింగ్ వీడియో స్ ని రిలీజ్ చేశారు.

Balakrishna: ఢీ అంటే ఢీ.. బాలయ్యలో ఇంతకు ముందెన్నడూ లేని జోష్!

ఇప్పటికే ఆడియో అదిరిపోయే సక్సెస్ సాధించింది. అంతేకాదు సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ అయిన సమంత పాట కూడా అదే రేంజ్ లో తెరకెక్కించారు టీమ్. అటు బన్నీ కూడా మూవీ విషయంలో ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అనేలా, స్టైలిష్ స్టార్ అన్న పేరు మర్చిపోయే పుష్పరాజ్ గెటప్ లో నెవర్ బిఫోర్ లుక్ తో అదిరిపోయే యాక్షన్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. బన్నీ ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేసినా.. పుష్ప మాత్రం వాటన్నింటినీ మించి ఉండబోతోంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడూ పెద్దగా ఎక్స్ పెరిమెంట్స్ జోలికెళ్లని బన్నీ.. ఫస్ట్ టైమ్ కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. కంప్లీట్ డీ గ్లామర్ లుక్ చేసే సాహసం చేశారు బన్నీ. మరి అవుట్ ఫుట్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

RRR: ఒకేరోజు 4 చోట్ల ట్రైలర్ లాంచ్.. యూనిట్ కోసం స్పెషల్ ఫ్లైట్!