New Directors: ఏదో తడబాటు.. ఛాన్సిచ్చినా వాడుకోని డైరెక్టర్లు

ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఈ మాట సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తమను తాము ప్రూవ్ చేస్కోడానికి స్టార్ హీరోలని ఇలా అడిగే ఉంటారు డైరెక్టర్లు. అలా ఒక్క ఛాన్స్ తో పెద్ద..

New Directors: ఏదో తడబాటు.. ఛాన్సిచ్చినా వాడుకోని డైరెక్టర్లు

New Directors

New Directors: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఈ మాట సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తమను తాము ప్రూవ్ చేస్కోడానికి స్టార్ హీరోలని ఇలా అడిగే ఉంటారు డైరెక్టర్లు. అలా ఒక్క ఛాన్స్ తో పెద్ద సినిమాలు చేసి సూపర్ సక్సెస్ కొట్టి ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేసిన వాళ్లున్నారు. కానీ అదే ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే.. పెద్ద సినిమాలు చెయ్యడం చేత కాక.. డిజాస్టర్లు ఫేస్ చేసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. పెద్ద సినిమా చెయ్యడం అంటే అంత ఈజీ కాదు. అలా ఏదో చేద్దామని స్టార్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఫ్లాప్స్ అందుకున్న సినిమాలు, డైరెక్టర్లను ఇప్పుడు చూద్దాం.

Telugu Directors: కథే కీలకం.. ప్రభాస్ లాంటి స్టార్‌ను కూడా పట్టేస్తున్న యంగ్ డైరెక్టర్‌లు!

రొటీన్ కథలను బ్రేక్ చేసి డిఫరెంట్ స్టోరీస్ తో డిఫరెంట్ సినిమా మేకింగ్ తో చాలా మంది యంగ్ డైరెక్టర్లు ఇండస్ట్రీలో తమ సత్తా చూపిస్తున్నారు. తమకు వచ్చిన ఒక్క సినిమా ఛాన్స్ తోనే మంచి క్రేజ్ ను, సక్సెస్ ను సంపాదించుకుంటున్నారు. సక్సెస్ లు ఉన్నాయి సరే కదా అని స్టార్ హీరోలు కూడా ఈమధ్య యంగ్ డైరెక్టర్ల తో సినిమాలు చేస్తున్నారు. అయితే అవి బ్లాక్ బస్టర్లు.. లేకపోతే సూపర్ డూపర్ డిజాస్టర్లు అవుతున్నాయి. ఎందుకంటే.. స్టార్ హీరోలను హ్యాండిల్ చెయ్యడం, పెద్ద సినిమాలు చెయ్యడం అంత ఈజీ కాదు కాబట్టి.

Tollywood Directors: తెలుగు సినిమాని కొత్తగా చూపిస్తున్న రూల్స్ బ్రేకర్స్!

ప్రబాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో రిలీజ్ అయిన రాధేశ్యామ్ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. పీరియాడిక్ లవ్ స్టోరీగా దాదాపు 300 కోట్లకు పైగా తెరకెక్కిన ఈ రెట్రో మూవీ 100 కోట్లకు పైగా నష్టాల్ని మిగిల్చింది. రాధాకృష్ణ జస్ట్ జిల్ అనే ఒక్క సినిమా మాత్రమే చేసి ప్రభాస్ సినిమాతో ఛాన్స్ దక్కించుకన్నాడు. పాన్ ఇండియా స్టార్ తో సినిమా ఛాన్స్ అయితే కొట్టేశాడు కానీ.. ప్రభాస్ స్టార్ డమ్ ని ఎగ్జిక్యూట్ చెయ్యడంలో సక్సెస్ కాలేకపోయాడు. దాంతో సినిమా ఫ్లాప్ ఫేస్ చెయ్యాల్సి వచ్చింది.

Telugu Directors: హిట్టు కొట్టినా కొత్త సినిమా పట్టాలెక్కించలేని దర్శకులు!

పెద్ద సినిమా మేకింగ్ లో తడబడి డిజాస్టర్ ఫేస్ చేసిన మరో డైరెక్టర్ సుజిత్. రన్ రాజా రన్ లాంటి హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ చేసిన యంగ్ డైరెక్టర్ సుజిత్.. ప్రభాస్ తో యాక్షన్ మూవీ ఛాన్స్ దక్కించుకన్నాడు. అయితే 200 కోట్లకు పైగా తెరకెక్కిన సాహో మూవీలో బాలీవుడ్ స్టార్ కాస్ట్, హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్, గ్రాండియర్ విజువల్స్ ఉన్నాయి కానీ.. సినిమా స్టోరీ విషయంలో డిసప్పాయింట్ చేశాడు సుజిత్. యాక్షన్ ఎక్కువై ఎమోషన్ మిస్ అవ్వడం, ప్రభాస్ ని కంప్లీట్ గా మాస్ యాంగిల్ లోనే చూపించడంతో భారీ యాక్షన్ మూవీ అయిన సాహో తెలుగులో సక్సెస్ సాధించలేకపోయింది.