Telugu Directors: కథే కీలకం.. ప్రభాస్ లాంటి స్టార్‌ను కూడా పట్టేస్తున్న యంగ్ డైరెక్టర్‌లు!

స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చెయ్యడం ప్రతి డైరెక్టర్ కల. ఒకప్పుడు ఆ కలని కనడమే తప్ప.. నిజం చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు డ్రీమ్ బిగ్ అంటూ యాస్పిరెంట్..

Telugu Directors: కథే కీలకం.. ప్రభాస్ లాంటి స్టార్‌ను కూడా పట్టేస్తున్న యంగ్ డైరెక్టర్‌లు!

Telugu Directors

Telugu Directors: స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చెయ్యడం ప్రతి డైరెక్టర్ కల. ఒకప్పుడు ఆ కలని కనడమే తప్ప.. నిజం చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు డ్రీమ్ బిగ్ అంటూ యాస్పిరెంట్ డైరెక్టర్లు చాలా మంది టాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేస్తూ.. ఇండియన్ సినిమాకే హైలెట్ అవుతున్నారు. అలాంటి కల కని నిజం చేసుకుంటున్న యంగ్ డైనమిక్ డైరెక్టర్లెవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Prabhas: రెబల్ స్టార్ యాక్షన్.. ఢీకొట్టే పవర్ఫుల్ విలన్స్ వీళ్ళే

టాలీవుడ్ లో ఒకప్పుడు పెద్ద సినిమాలు చెయ్యడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. భారీ సినిమాలంటే.. ఓ రాజమౌళి, ఓ సంజయ్ లీలా భన్సాలీ, ఓ పూరీ జగన్నాధ్, ఓరాజుహిరానీ లాంటి పెద్ద డైరెక్టర్లకే ఆ చాన్స్ దక్కేది. టాలెంటెడ్ డైరెక్టర్లున్నా.. కమర్షియల్ పాత్ ని బ్రేక్ చేసి కొత్త డైరెక్టర్లు, కొత్త కథలతో ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడానికి రెడీగా ఉండేవారు కాదు హీరోలు. కానీ ఇప్పుడు పెద్ద కాన్వాస్ మీద తమ కలను నిజం చేస్కోడానికి రెడీ అయ్యారు యంగ్ డైరెక్టర్లు.

Prabhas Marriage : అందుకే నాకింకా పెళ్ళికాలేదు.. పెళ్లిపై స్పందించిన ప్రభాస్

రొటీన్ సినిమాలు కాకుండా పాత్ బ్రేకింగ్ మూవీస్ చేస్తూ.. ట్రెండ్ సెట్ చేస్తున్నారు న్యూ ఏజ్ డైరెక్టర్స్. క్వాలిటీ మూవీ మేకింగ్ తో తెలుగు సినిమాని ఎలివేట్ చేస్తూ.. స్టార్ హీరోలతో సినిమా ఆఫర్లను కొట్టేస్తూ.. టాలీవుడ్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతున్న ఇంట్రస్టింగ్ డైరెక్టర్లు చాలామంది ఇప్పుడు తెరమీదకొస్తున్నారు. ప్రభాస్ తో సినిమా అంటే కనీసం ఓ రేంజ్ డైరెక్టర్ అయ్యి ఉండాలి. కానీ జస్ట్ ఒకే ఒక్క సినిమా చేసి ప్రభాస్ తో రాధేశ్యామ్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు రాధాకృష్ణ.

Radhe Shyam: రెబల్ స్టార్ రేంజ్.. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్!

చేసింది ఒకే ఒక్క సినిమా.. ఆ సినిమా కూడా అంతగా ఆడియన్స్ కి రీచ్ అవ్వలేదు. కానీ సినిమా మీద ఉన్న ప్రేమ, కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో 15 ఏళ్ల తన కలని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రాధాకృష్ణ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో.. పాన్ ఇండియా స్టార్ తో.. తన ప్యాషన్ ని డిఫరెంట్ గా డేరింగ్ గా రాధేశ్యామ్ సినిమాగా ఆడియన్స్ కి అందించబోతున్నారు ఈ యాస్పిరెంట్ యంగ్ డైరెక్టర్.

Project K: హెల్ప్ ప్లీజ్ అంటూ హైప్ పెంచిన అశ్విన్.. అసలేంటి ప్రాజెక్ట్ కె?

టాలీవుడ్ లో సో కాల్డ్ కమర్షియల్ సినిమాల మేకింగ్ ను బ్రేక్ చేస్తూ.. అప్పుడప్పుడే కొత్త కధలు, కొత్త మేకింగ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటూ కొత్త పాత్ క్రియేట్ చేస్తున్నారు ఈ న్యూ ఏజ్ డైరెక్టర్స్. ఇలా మరో యంగ్ డైరెక్టర్ నాగాశ్విన్ కూడా డిఫరెంట్ సినిమాలు చేసి ఒక కొత్త పాత్ ని క్రియేట్ చేశాడు. హీరో అంటే సోకాల్డ్ హీరోయిజం చూపించాలి.. ఫైట్స్ చెయ్యాలి లాంటి రొటీన్ రూల్స్ లేకుండా.. జస్ట్.. కథను మాత్రమే హీరోగా చూపించాడు నాగశ్విన్. రెండే సినిమాలు చేసిన నాగాశ్విన్.. ప్రభాస్ తో తన పెద్ద సినిమా కలను నెరవేర్చుకుంటున్నాడు. ప్రాజెక్ట్ కె టైటిల్ తోతెరకెక్కుతున్న ఈమూవీలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్ కాస్ట్ అమితాబ్, దీపికా పదుకోన్ లతో కలిపి బిగ్ స్క్రీన్ మీద చూపించబోతున్నారు నాగశ్విన్.

Salaar: బాప్ రే.. సలార్ ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్?

సౌత్ లో చిన్న సినమా ఇండస్ట్రీ అయిన కన్నడ నుంచి కెజిఎఫ్ అనే పెద్ద సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ప్రశాంత్ నీల్. ఈ హిట్ కి ఇండియా మొత్తం షాక్ అయ్యింది. భారీ బడ్జెట్ తో అంతకంటే గ్రాండ్ విజువల్స్ తో భారీ తెరకెక్కిన కెజిఎఫ్ 2 ఇంకా రిలీజ్ కు ముందే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా చాన్సిచ్చారు. నెవర్ బిఫోర్ మేకింగ్ తో అంతకముందు సినిమాలకంటే గ్రాండ్ గా సలార్ మూవీని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. శృతి హాసన్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ కు రెడీ చేస్తున్నారు ప్రభాస్.

Adipurush : వచ్చే సంక్రాంతికి ‘ఆదిపురుష్’.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్

ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా చెయ్యాలంటే.. అది మామూలు విషయం కాదు.. కమర్షియల్ సినిమా అయితే ఎంతో కొంత గ్యారంటీ ఉంటుంది కానీ.. ఆదిపురుష్ టైటిల్ తో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే సినిమా అంటే.. దానికి చాలా గట్స్ కావాలి. అసలు ఇలాంటి ఓ సబ్జెక్ట్ ని ప్రభాస్ కి చెప్పడం, ఆ స్టార్ హీరో చేత ఒప్పించడం చాలా పెద్ద టాస్క్. అలాంటి పని ఈజీగా చేసేశారు బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్. బాలీవుడ్ లో చేసింది 2,3 సినిమాలే అయినా.. కథను తెర మీద చూపించే విధానానికి ఆడియన్స్ తో పాటు ప్రభాస్ కూడా ఇంప్రెస్ అయ్యారు. అందుకే ప్రభాస్ రాముడి క్యారెక్టర్ లో కనిపించే.. ఆదిపురుష్ లాంటి సినిమా చేస్తున్నారు.

SPIRIT : పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రభాస్..

తెలుగు సినిమాలో పాత్ బ్రేకింగ్ మూవీ.. అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన సందీప్ రెడ్డి.. అసలు తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాగలదా అని ఊహించేలోపే అలాంటి హార్డ్ కోర్ సినిమా చేసి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. టాలీవుడ్ సోకాల్డ్ మూవీ మేకింగ్ రూల్స్ ని బ్రేక్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ గా సందీప్ మంచి క్రెడిట్ సాధించాడు. రెండే సినిమాలు చేసిన సందీప్ కూడా ప్రభాస్ తో పెద్ద సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. స్పిరిట్ టైటిల్ తో పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా.. 8భాషల్లో తెరకెక్కబోతోంది ఈ సినిమా.