Radhe Shyam: రెబల్ స్టార్ రేంజ్.. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్!

ప్రమోషన్స్ తో రచ్చ చేస్తున్నారు రాధేశ్యామ్ జోడి. భారీ స్తాయిలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు రాధేశ్యామ్ మేకర్స్. ఇప్పుడు ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ కాదు, గ్లోబల్ స్టార్..

Radhe Shyam: రెబల్ స్టార్ రేంజ్.. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్!

Radhe Shyam

Radhe Shyam: ప్రమోషన్స్ తో రచ్చ చేస్తున్నారు రాధేశ్యామ్ జోడి. భారీ స్తాయిలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు రాధేశ్యామ్ మేకర్స్. ఇప్పుడు ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ కాదు, గ్లోబల్ స్టార్ అంటున్నారు ఫాన్స్. సో రాధేశ్యామ్ రిలీజ్ కూడా ఆ స్తాయికి తగ్గట్టుగానే ఉంటుందా?

Radhe Shyam: రా.. రా.. రాధేశ్యామ్.. ఇక కొన్ని గంటలే మిగిలింది!

సాంగ్స్, టీజర్స్, మేకింగ్ వీడియో, ఇంటర్వ్యూస్, ఎన్ ఎఫ్ టితో ప్రజెంట్ హడావిడీ అంతా రాధేశ్యామ్ దే. ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తోన్న ఈ మూవీ మార్చ్ 11న వరల్డ్ వైడ్ గా లార్జ్ స్కేల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ పై ఇటు ఇండస్ట్రీలో అటు ఫాన్స్ మధ్య పెద్ద చర్చే నడుస్తుంది. తెలుగు సినిమా హిస్టరీలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డ్ స్తాయి థియేటర్స్ లో రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది.

Radhe Shyam: డార్లింగ్ కష్టాలు.. రాధేశ్యామ్ వెనక జరిగిందేంటి?

ఓవర్సీస్ లోనే మూడు వేలకు పైగా థియేటర్స్ లో పదకొండు వేల స్క్రీన్స్ లో రాధేశ్యామ్ ను రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఏపి, తెలంగాణలో అయితే సుమారుగా 1600 థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ లోనే దాదపు 120 థియేటర్స్ లో రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. నైజాంలో 600 థియేటర్లు, ఆంధ్రప్రధేశ్లో సుమారుగా 1000 థియేటర్లలో రిలీజ్ కానుంది రాధేశ్యామ్.

Radhe Shyam: ఫస్ట్ రివ్యూ.. ‘క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’!

బాలీవుడ్ లో ఏ ఏ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు 4000కు పైగా థియేటర్స్ లో రాధేశ్యమ్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.. ఇక తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కలిపి, ఇంకో పదిహేను వందల థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ బాలీవుడ్ సినిమాలను కూడా ఈ స్తాయిలో్ రిలీజ్ చేయలేదు. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాను అదీ ప్రభాస్ సినిమాను ఈ స్తాయిలో రిలీజ్ చేయడం విశేషం.

Radhe Shyam: ప్రమోషన్ ఎంగేజ్మెంట్.. సందడంతా పూజా-ప్రభాస్‌దే!

బాహుబలితో నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సాహోతో హాలీవుడ్ స్టైల్ మేకింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడు… సాహో తర్వాత ప్రభాస్ థియేటర్ లో కొచ్చేది రాధేశ్యామ్ తోనే. రాధేశ్యామ్ తో వరల్డ్ వైడ్ ఫాన్స్ ను సాటిస్ఫై చేసేలా పదివేలకు పైగా థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేసి, ఫాన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నారు మేకర్స్.