New Parliament : 404 చెట్లు తొలగింపుకు పరిహారంగా 4040 మొక్కలు నాటాలి..రూ.2.30 కోట్లు డిపాజిట్‌ చేయాలి

కొత్త పార్లమెంటు భవన నిర్మాణం సందర్భంగా ప్రస్తుతం పార్లమెంటు భవనప్రాంగణంలోని 404 చెట్లను తొలగించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి పరిహారంగా 4,040 మొక్కలు నాటాలని ఉత్తర్వులు.

New Parliament : 404 చెట్లు తొలగింపుకు పరిహారంగా 4040 మొక్కలు నాటాలి..రూ.2.30 కోట్లు డిపాజిట్‌ చేయాలి

New Parliament Building

New Parliament Building : కొత్తగా పార్లమెంట్ భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కొత్త నిర్మాణాలు జరిగే సమయంలో ఆ ప్రాంతంలో ఉండే మొక్కల్ని, చెట్లను తొలగించటం సర్వసాధారణం. అలాగే కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం సదర్భంగా ఆ ప్రాంతంలో ఉండే చెట్లను తొలగింపు జరుగుతోంది. ఇప్పటికే కొన్ని చెట్లను తొలగించారు. అలా ఇప్పటికే 404 చెట్లను తొలగించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో తొలగించిన 404 చెట్లకు బదులుగా 4040 మొక్కలు నాటాలని కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారి చేసింది. అలాగే నాటిన మొక్కల్ని పరిరక్షించాలని..కూడా స్పష్టం చేసింది.

Read more : Modi : కొత్త పార్లమెంటు భవన నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

కాగా..కొత్త పార్లమెంటు భవన నిర్మాణం సందర్భంగా ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవన ప్రాంగణంలో ఉన్న 404 చెట్లను తొలగించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నందునందుకు పరిహారంగా ఆ ప్రాంతంలో కొత్తగా 4,040 మొక్కలు నాటి పెంచాలని కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొక్కల నిర్వహణకు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ ముందస్తుగా రూ.2.30 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే నాటిన మొక్కల్ని నాటబోయే మొక్కలను ఏడు సంవత్సరాల పాటు పీడబ్ల్యూడీ డిపార్ట్ మెంట్ పర్యవేక్షిస్తూ సంరక్షించాలని స్పష్టంచేసింది.

తరలించిన 404 చెట్లలో ప్రతి చెట్టుకు 10 చొప్పున 6-8 అడుగులమేర ఎత్తున్న మొక్కలను నాటాలని..ఆ మొక్కలు నాటేందుకు కేటాయించిన భూమిని మరే అవసరాలకూ వాడకూడదని సుస్పష్టం చేసింది. నాటిన మొక్కల్లో ఏ ఒక్క మొక్క చనిపోయనా ఆ స్థానంలో మరో మొక్కను నాటాలని వాటిని సంరక్షిచాలని తేల్చి చెప్పింది. అంతేకాదు అలా చనిపోయిన మొక్కల లోటును భర్తీలా 500 మొక్కలు అదనంగా నాటాలని వెల్లడించింది. ఇప్పటివరకు అనుమతి ఇచ్చిన 404 చెట్లకు అదనంగా ఏవైనా చెట్లను నరికేసినా..అక్కడి నుంచి తరలించినా దాన్ని నేరంగా పరిగణిస్తామని కూడా హెచ్చరించింది.

Read more : కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు ఇవే

కాగా కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ చేతులు మీదుగా పునాదిరాయి పడిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో కొలువు దీరనున్న కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలు కూడా విడుదలయ్యాయి. 2020 డిసెంబర్ 10 ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా పార్లమెంట్ భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహా మహులంతా తరలివచ్చారు. విదేశీ ప్రతినిధులు సైతం విర్చువల్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతీయ చిత్రకళ, సంస్కృతి, సంప్రదాయాల కలబోతగా నూతన పార్లమెంట్ భవనం ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్ భవనాల కంటే మిన్నగా తీర్చిదిద్దుతున్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రత్యేకతలివే..

64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ నూతన పార్లెమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.971 కోట్లు అవుతుందని అంచనా వేయగా అది మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. 2022 ఆగస్టు 15 నాటికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభించాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.