Traffic Rules : జంట నగరాల్లో వాహనాలపై స్పీడ్ కంట్రోల్‌!

హైదరాబాద్‌ జంట నగరాల్లో ట్రాఫిక్‌ రూల్స్‌లో భారీ మార్పులకు రంగం రెడీ అయ్యింది. స్పీడ్ కంట్రోల్‌తోపాటు... ఓలో ఆటోల పర్మిషన్‌పైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.

Traffic Rules : జంట నగరాల్లో వాహనాలపై స్పీడ్ కంట్రోల్‌!

New Traffic Rules For Hyderabad Twin Cities

Updated On : February 20, 2022 / 7:22 AM IST

Traffic Rules : హైదరాబాద్‌ జంట నగరాల్లో ట్రాఫిక్‌ రూల్స్‌లో భారీ మార్పులకు రంగం రెడీ అయ్యింది. స్పీడ్ కంట్రోల్‌తోపాటు… ఓలో ఆటోల పర్మిషన్‌పైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా స్పీడ్‌ లిమిట్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నగరంలో ఇకపై శాస్త్రీయ వేగపరిమితి అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై వన్‌ వే.. టూవే రహదారుల ఆధారంగానే వాహనదారులు వెళ్లాల్సిన వేగాన్ని నిర్ధారించారు.

ప్రాంతంతో సంబంధంలేకుండా పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై గంటకు 80 కిలోమీటర్లు, ఓఆర్‌ఆర్‌పై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు అవకాశం ఇచ్చారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాలనీల్లో ఎక్కడైనా సరే.. ప్రతి వాహనం 35 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్లకూడదని పోలీస్‌ అధికారులు తెలిపారు. బైకు, కారు, బస్సు ఇలా ఏ వాహనమైనా సరే… మితిమీరిన వేగంతో వెళితే రూ. 1400 వరకు జరిమానా విధిస్తున్నారు.

ఇకపై అలాకాకుండా బైక్‌కు తక్కువ, భారీ వాహనాలకు ఎక్కువగా జరిమానా విధించాలని నిర్ణయించారు. ద్విచక్రవాహనానికి రూ. 300, ఆటోలు, కార్లు, ఎస్‌యూవీ కార్లకు.. రూ. 500.. బస్సులు, డీసీఎంలు, లారీలు, భారీ వాహనాలకు రూ.700 జరిమానా విధించనున్నారు. జంట నగరాల్లో రిజిస్టర్‌ అయిన ఓలో ఆటోలు (Ola Autos) మాత్రమే హైదరాబాద్‌ నగరంలో తిరిగేలా రూల్స్‌ చేంజ్‌ చేస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు.

ఆర్టీఏ రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ TS9 నుంచి TS12 వరకు ఉన్న ఓలా ఆటోలు మాత్రమే హైదరాబాద్‌లో తిప్పేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ అయిన ఓలా ఆటోలు.. హైదరాబాద్‌లో తిప్పేందుకు అనుమతి లేదని తేల్చి చెబుతున్నారు. మార్చి ఒకటి నుంచి వీటిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించారు.

Read Also : Traffic Rules:కొత్త ట్రాఫిక్ రూల్స్ : 5 ఏళ్లు దాటిన చిన్నారులకూ హెల్మెట్ తప్పనిసరి