Niharika Konidela : చైతన్య, నేను పరస్పర అంగీకారంతోనే విడిపోయాం.. నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

గత కొన్ని రోజులుగా నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు డిలీట్ చేయడం, ఒకర్నొకరు అన్ ఫాలో చేయడంతో ఈ డౌట్ అందరికి మొదలైంది.

Niharika Konidela : చైతన్య, నేను పరస్పర అంగీకారంతోనే విడిపోయాం.. నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

Niharika Konidela post on her divorce with Chaitanya Jonnalagadda

Updated On : July 5, 2023 / 1:02 PM IST

Niharika Konidela Divorce :  మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా నిహారిక అందరికి పరిచయమే. టీవీ షోలలో యాంకర్ గా, సిరీస్, సినిమాల్లో నటిగా, హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది నిహారిక. నిహారిక ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో నటిగా, నిర్మాతగా బిజీగా ఉంది. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని 2020 లో ఘనంగా పెళ్ళి చేసుకుంది.

రాజస్థాన్ లోని ఓ రాజ్ మహల్ లో నిహారిక – చైతన్య పెళ్లి ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారు. వీరిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ అనే సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు డిలీట్ చేయడం, ఒకర్నొకరు అన్ ఫాలో చేయడంతో ఈ డౌట్ అందరికి మొదలైంది.

Nikhil Siddhartha : వేరే రాష్ట్రాల అభిమానులకు సారీ చెప్పిన నిఖిల్.. స్పై సినిమా విషయంలో.. ఎందుకో తెలుసా?

నిన్న నిహారిక – చైతన్య కు విడాకులు అయినట్టు కోర్టు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వీరిద్దరూ విడిపోయారు అని అంతా డిసైడ్ అయ్యారు. నేడు తాజాగా నిహారిక తన విడాకుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో.. నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నాకు ఈ విషయంలో సపోర్ట్ గా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి చాలా థ్యాంక్స్. మాకు ఈ సమయంలో కొంచెం ప్రైవసీ ఇవ్వండి. అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది. దీంతో నిహారిక పోస్ట్ వైరల్ గా మారింది. ఇక చైతన్య కూడా ఇదే విధంగా పోస్ట్ పెట్టాడు. ఇక వీరిద్దరి విడాకులకు కారణాలు మాత్రం తెలియలేదు.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

 

View this post on Instagram

 

A post shared by Chaitanya Jv (@chaitanya_jv)