Nikhil Siddhartha : ‘స్పై’ టీజర్ ఏకంగా దేశ రాజధానిలో రిలీజ్.. నిఖిల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

‘స్పై’ టీజర్ ను మే 15న దేశ రాజధాని ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉండే కర్తవ్యపథ్ దగ్గర విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. చిత్రయూనిట్, నిఖిల్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

Nikhil Siddhartha : ‘స్పై’ టీజర్ ఏకంగా దేశ రాజధానిలో రిలీజ్.. నిఖిల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

Nikhil Siddhartha SPY Teaser releasing at Kartavya Path in Delhi

Updated On : May 13, 2023 / 6:30 AM IST

Nikhil Siddhartha :  కార్తికేయ 2(Karthikeya 2), 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నిఖిల్ సిద్దార్థ(Nikhil Siddhartha). ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ తో రాబోతున్నాడు. ఐశ్వర్య మీనన్(Iswarya Menon) హీరోయిన్ గా, ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా ఈ సినిమా భారీగా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా. నిఖిల్ ‘స్పై’(SPY) సినిమా జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా సుభాష్ చంద్రబోస్(Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా తెరకెక్కించినట్టు సమాచారం.

SPY Movie: సుభాష్ చంద్రబోస్ మిస్టరీని బయటపెట్టేందుకు రెడీ అయిన స్పై

ఇక ‘స్పై’ టీజర్ ను మే 15న దేశ రాజధాని ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉండే కర్తవ్యపథ్ దగ్గర విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. చిత్రయూనిట్, నిఖిల్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఈ ప్లేస్ లో ఫస్ట్ టైం ఓ సినిమాకి సంబంధిన కార్యక్రమం జరగబోతున్నటు తెలిపారు. ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్టు సమాచారం. ఇప్పుడు టీజర్ కూడా గ్రాండ్ గా ఢిల్లీలో రిలీజ్ చేస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ ‘స్పై’ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నాడు నిఖిల్.