Nitish rejects BJP claims: చాలా పెద్ద జోక్: బీజేపీ నేతల వ్యాఖ్యలపై నితీశ్ సెటైర్

2015లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఆర్జేడీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ పొత్తు ప్రకారం.. నితీశ్‭ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం రెండేళ్లకు అంటే 2017లో అప్పటి ఉప ముఖ్యమంత్రి తేజస్వీపై అవినీతి ఆరోపణలు చేసి పొత్తు తెంచుకున్నారు

Nitish rejects BJP claims: చాలా పెద్ద జోక్: బీజేపీ నేతల వ్యాఖ్యలపై నితీశ్ సెటైర్

Nitish rejects BJP claims: తాను ఉపరాష్ట్రపతి కావాలని అనుకున్నట్లు భారతీయ జనతా పార్టీ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన వ్యాఖ్యలను నితీశ్ కుమార్ తోసి పుచ్చారు. ‘ఇది చాలా పెద్ద జోక్’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్‭‭పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీజేపీ ఆయనను ఐదుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని, అయినప్పటికీ పొత్తు ధర్మాన్ని తెంచుకుని కూటమికి ద్రోహం చేశారంటూ నితీశ్‭పై నిప్పులు చెరుగుతున్నారు.

ఇందులో భాగంగా బిహార్‭ మాజీ ముఖ్యమంత్రి, నితీశ్ మాజీ కేబినెట్ సహచరుడు అయిన సుశీల్ కుమార్ మోదీ బుధవారం మాట్లాడుతూ ‘‘జేడీయూ నేతలు కొందరు నన్ను నేరుగా కలిసి నితీశ్‭ను ఉప రాష్ట్రపతి చేయాలని కోరారు. ఆయనను ఢిల్లీకి పంపి బిహార్ ముఖ్యమంత్రిగా నన్ను ఉండమన్నారు’’ అని అన్నారు. దీనిపై గురువారం నితీశ్‭ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇది చాలా పెద్ద జోక్. ఎందుకంటే, రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చాం. ఉప రాష్ట్రపతి ఎన్నికలో కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇచ్చాం. నేను ఉప రాష్ట్రపతి కావాలి అనుకుంటే ఎన్డీయే అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తాను?’’ అని అన్నారు.

2015లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఆర్జేడీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ పొత్తు ప్రకారం.. నితీశ్‭ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం రెండేళ్లకు అంటే 2017లో అప్పటి ఉప ముఖ్యమంత్రి తేజస్వీపై అవినీతి ఆరోపణలు చేసి పొత్తు తెంచుకున్నారు. వెంటనే బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రిగా మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2020లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నితీశ్, తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఆర్జేడీ లాగే బీజేపీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకు మళ్లీ బీజేపీతో దోస్తీని కట్ చేసి ఆర్జేడీతో చేతులు కలిపి ఎనిమదవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.