Maharashtra: మంత్రి ప‌ద‌వుల‌పై బీజేపీతో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు: ఏక్‌నాథ్ షిండే

మ‌హారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే వ‌ర్గానికి చెందిన శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రేపు సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణ స్వీకారం చేస్తారని వార్త‌లు వ‌స్తున్నాయి.

Maharashtra: మంత్రి ప‌ద‌వుల‌పై బీజేపీతో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు: ఏక్‌నాథ్ షిండే

Maharashtra

Maharashtra: మ‌హారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే వ‌ర్గానికి చెందిన శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రేపు సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణ స్వీకారం చేస్తారని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈ ప్ర‌చారాన్ని ఏక్‌నాథ్ షిండే ఖండించారు. ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీతో తాము ఏ అంశాల‌పైనా చ‌ర్చించ‌లేద‌ని ట్విటర్ వేదిక‌గా స్ప‌ష్టం చేశారు. అయితే, ఆ పార్టీతో చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని చెప్పారు.

Maharashtra Politics : ముచ్చటగా మూడోసారి సీఎంగా ఫడ్నవీస్​..డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే

అలాగే, మంత్రుల జాబితా అంటూ వ‌స్తోన్న ప్ర‌చారాన్ని కూడా న‌మ్మొద్ద‌ని ఏక్ నాథ్ షిండే అన్నారు. ఏయే శాఖ‌ల‌కు ఎవ‌రెవ‌రిని కేటాయిస్తున్నారంటూ కొంద‌రి పేర్ల‌ను పేర్కొంటూ వార్త‌లు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. పూజ్యుడు బాల్ ఠాక్రే హిందుత్వ‌, ధ‌ర్మ‌వీర్ ఆనంద్ సాహెబ్ బోధ‌న‌లు పాటిస్తూ మ‌హారాష్ట్ర అభివృద్ధిపై తాము దృష్టి పెడ‌తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?
కాగా, శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తమ పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్యాంపు ఏర్పాటు చేయడంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. షిండే తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసేది ఎవ‌ర‌న్న అంశంపై ఉత్కంఠ నెల‌కొంది.