north korea: క‌ఠిన ఆంక్ష‌ల నుంచి ఉత్త‌ర‌కొరియా ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లోనే ఉప‌శ‌మ‌నం

క‌రోనా విజృంభ‌ణ‌తో వ‌ణికిపోతోన్న ఉత్త‌ర కొరియాలో క‌ఠిన ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, త్వ‌ర‌లోనే క‌రోనా నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించే అవ‌కాశం ఉంది.

north korea: క‌ఠిన ఆంక్ష‌ల నుంచి ఉత్త‌ర‌కొరియా ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లోనే ఉప‌శ‌మ‌నం

North

north korea: క‌రోనా విజృంభ‌ణ‌తో వ‌ణికిపోతోన్న ఉత్త‌ర కొరియాలో క‌ఠిన ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, త్వ‌ర‌లోనే క‌రోనా నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించే అవ‌కాశం ఉంది. క‌రోనా ఆంక్ష‌ల‌ను స‌వ‌రించే విష‌యంపై ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారని అక్క‌డి మీడియా పేర్కొంది. దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల గురించి వివ‌రాలు తెలుసుకున్న కిమ్ ఆంక్ష‌ల స‌డ‌లిస్తూ త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Jagdeep Dhankhar: మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్‌పై చ‌ర్య‌లు తీసుకోండి: గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు

క‌రోనా తీవ్రత త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రిపార‌ని తెలిపింది. ఉత్త‌ర కొరియాలో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి క‌ఠిన ఆంక్ష‌లు విధించ‌డంతో ఆహార‌, ఆర్థిక సంక్షోభం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని కూడా ఇటీవ‌ల ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. కాగా, ఆదివారం ఉత్త‌ర కొరియాలో 89,500 మందిలో జ్వర సంబంధిత ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ్డాయి. దీంతో ఇటువంటి ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ్డవారి సంఖ్య మొత్తం 34 ల‌క్ష‌ల‌కు చేరింది. కొత్త‌గా మ‌ర‌ణాలు సంభ‌వించాయా? అన్న విష‌యంపై ఉత్త‌ర కొరియా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.