Telangana Jobs: తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

నోటిఫికేషన్లను జారీ చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు...మొత్తం 16 వేల 027 పోస్టులను భర్తీ చేయనుంది. మే 02 నుంచి మే 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు...

Telangana Jobs: తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Kcr Jobs

Telangana Police Department : తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర స్టార్ట్ అయ్యింది. ఇటీవలే నోటిఫికేషన్ ల విషయంలో రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా సీఎం కేసీఆర్ ఓ కీలక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ శాఖలు, విభాగాల్లో మొత్తం 91 వేల 142 ఖాళీ పోస్టులున్నట్లు గుర్తించింది. అందులో 11 వేల 103 కాంట్రాక్ట్ పోస్టులు మినహా 80 వేల 039 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేయాలని నిర్ణయించారు. నోటిఫికేషన్లను జారీ చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా.. 2022, ఏప్రిల్ 25వ తేదీ సోమవారం పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

Read More : కానిస్టేబుల్ జాబ్స్: ఎంపికైన అభ్యర్ధులకు ముఖ్య సూచనలు

ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 16 వేల 027 పోస్టులను భర్తీ చేయనుంది. మే 02 నుంచి మే 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు సివిల్ ఎస్ఐ – 44, ఏఆర్ ఎస్ఐ – 66, సివిల్ కానిస్టేబుల్ – 4, 965, ఆర్మ్ డ్ రిజర్వ్డ్ పోలీసు కానిస్టేబుల్ – 4, 423, స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ – 5,010, ఐటీ, కమ్యూనికేషన్ ఎస్ఐ – 22, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 26, ఇందుకు ఒక వెబ్ సైట్ ను రూపొందించారు. అందులో దరఖాస్తులను పంపించాలని అధికారులు సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్ లో ఉంటాయని తెలిపారు.

Read More : Government Jobs : తెలంగాణలో 86వేల ఉద్యోగాలు ఖాళీ, త్వరలో 55వేల పోస్టులు భర్తీ..!

పోలీసు శాఖకు పెద్ద పీఠ వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 16 వేల 027 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కమీషనరేట్, ఎస్పీ పరిధిలో స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ లలో స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. దరఖాస్తుల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే.. వాటిని నివృత్తి చేయడానికి సెల్ లను ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా… డీజీపీ కార్యాలయంలో, ప్రతి కమిషనరేట్ పరిధిలో ఒక సెల్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా నోటిఫికేషన్ విడుదల కావడం పట్ల నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.