NTR : చలపతిని కడసారి చూసేందుకు వీడియో కాల్ చేసిన ఎన్టీఆర్..
సీనియర్ నటుడు చలపతి రావు మరణం తెలుగు సినీపరిశ్రమని దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా చలపతికి టాలీవుడ్ లో నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చలపతిని బాబాయ్ అని పిలిచే జూనియర్ ఎన్టీఆర్.. ఆయనని కడసారి చూసేందుకు కూడా రాలేని పరిస్థితిలో అమెరికాలో ఉన్నాడు. దీంతో చలపతిని కడసారి చూసేందుకు..

NTR made a video call to see Chalapathi rao for last time
NTR : సీనియర్ నటుడు చలపతి రావు మరణం తెలుగు సినీపరిశ్రమని దిగ్బ్రాంతికి గురిచేసింది. డిసెంబర్ 24 రాత్రి హార్ట్ ఎటాక్‌తో అయన కన్నుమూశారు. ఎప్పుడు అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే చలపతి వెళ్లిపోవడం కూడా అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్లిపోయినట్లు తెలియజేశాడు అయన కుమారుడు రవిబాబు. ఇక చలపతికి వీడ్కోలు పలికేందుకు సినీ ప్రముఖులు నిన్న అయన ఇంటికి చేరుకొని నివాళ్లు అర్పించారు.
Balayya – NTR : తమ కుటుంబసభ్యుడిని కోల్పోయాము అంటున్న బాలయ్య, ఎన్టీఆర్.. చలపతి మరణం!
కాగా చలపతికి టాలీవుడ్ లో నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే నిన్న అయన మరణవార్త తెలుసుకున్న నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. తమ కుటుంబసభ్యుడైన చలపతి గారిని కోల్పోవడం మాకు తీరని లోటు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే చలపతిని బాబాయ్ అని పిలిచే జూనియర్ ఎన్టీఆర్.. ఆయనని కడసారి చూసేందుకు కూడా రాలేని పరిస్థితిలో అమెరికాలో ఉన్నాడు.
దీంతో చలపతిని కడసారి చూసేందుకు.. నిన్న రవిబాబుకి వీడియో కాల్ చేసి చలపతి రావుని కడసారి చూసి భావోద్వేగానికి గురయ్యాడు. రవిబాబు ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా చలపతి రావు కుమార్తెలు అమెరికాలో ఉండడంతో, వారిద్దరూ వచ్చిన తరువాత బుధవారం అయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలియజేశాడు రవిబాబు. అప్పటివరకు చలపతి పార్థివదేహాన్ని మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచనున్నారు.
.@tarak9999 Anna video call to Ravi Babu garu For #ChalapathiRao Babai garu ?#ripchalapathiraogarupic.twitter.com/aAG67JKADV
— Vizianagaram NTR Fans ?? (@vzmNTRfans) December 25, 2022