Virat Kohli: పూజారా, రహానెల భవిష్యత్ గురించి ఆలోచించడం నా పని కాదు – కోహ్లీ

దీని గురించి కూర్చొని చర్చించాల్సిన అవసరం నాకు లేదు. సెలక్టర్ల మైండ్ లో ఏముందో వాళ్లకే తెలియాలి. అది నా పని కాదు' అంటూ కౌంటర్ ఇచ్చాడు కోహ్లీ.

Virat Kohli: పూజారా, రహానెల భవిష్యత్ గురించి ఆలోచించడం నా పని కాదు – కోహ్లీ

Virat Kohli

Virat Kohli: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ లో టీమిండియా 1-2తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ఓవరాల్ గా టీమిండియా ప్రదర్శనపై రెస్పాండ్ అయిన విరాట్ బ్యాటింగ్ లేమి ఓటమికి కారణమని చెప్పుకొచ్చాడు. మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అజింకా రహానె, చతేశ్వర్ పూజారాల భవిష్యత్ గురించి కూడా అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు.

గత రెండేళ్లుగా ఈ ఇద్దరి ప్రదర్శన అంతగొప్పగా ఉండటంలేదు. ఆరు ఇన్నింగ్స్ లో రహానె ఆడింది 136పరుగులు, పూజారా 124పరుగులు మాత్రమే చేశాడు. ఇవేమంత పెద్ద స్కోరుగా పరిగణించలేరా అని అడిగిన ప్రశ్నకు రెస్పాండ్ అయిన కోహ్లీ..

‘దీని గురించి కూర్చొని చర్చించాల్సిన అవసరం నాకు లేదు. సెలక్టర్ల మైండ్ లో ఏముందో వాళ్లకే తెలియాలి. అది నా పని కాదు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు కోహ్లీ.

ఇది కూడా చదవండి: ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన కంపెనీ హెడ్

‘కీలక పరిస్థితుల్లో వాళ్లిద్దరూ బాగా ఆడారు. పూజారాను, రహానెను సపోర్ట్ చేస్తా. కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్ లో బాగా రాణిస్తున్నారు. కీలక పరిస్థితులు హ్యాండిల్ చేయడం తెలుసు. రెండో టెస్టులో చాలా కీలక పార్టనర్‌షిప్ నెలకొల్పారు’ అని ముగించాడు.