Free Cycles: ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన కంపెనీ హెడ్

ఫిట్‌నెస్ ఔత్సాహికులకు సైకిలింగ్ ఒక బెస్ట్ ఛాయీస్. పర్యావరణ హితంగానూ, ఎక్సర్‌సైజ్ చేసినట్లుగానూ ఉండటంతో అన్ని వయస్సుల వారు సైకిలింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంటారు.

Free Cycles: ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన కంపెనీ హెడ్

Euronics

Free Cycles: ఫిట్‌నెస్ ఔత్సాహికులకు సైకిలింగ్ ఒక బెస్ట్ ఛాయీస్. పర్యావరణ హితంగానూ, ఎక్సర్‌సైజ్ చేసినట్లుగానూ ఉండటంతో అన్ని వయస్సుల వారు సైకిలింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంటారు.

సౌత్ హెడ్ ఆఫ్ యురోనిక్స్, మొహమ్మద్ సాదిఖ్ తమ ఉద్యోగులకు ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేశారు. ‘నా స్నేహితులు కొందరి నుంచి ఇన్‍‌స్పైర్ అయ్యాను. వాళ్లు రెగ్యూలర్ సైకిలింగ్ తో హెల్తీగా ఉన్నారు. నా ఆరోగ్యం కూడా హెల్తీగా, రోజంతా యాక్టివ్ గా ఉంటుంది’ అని మొహమ్మద్ చెప్పారు.

‘మా కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ రెండు నెలల్లోనే వెయ్యి కిలోమీటర్ల వరకూ సైకిలింగ్ చేశారు. ఆయనకు ఈ ఐడియా చెబితే నన్ను అప్రిషియేట్ చేశారు. అందుకే ప్రతి ఉద్యోగికి సైకిల్ ఇస్తున్నాం. మొదటి నెల 150కిలోమీటర్లు టార్గెట్ ఇస్తున్నాం. అలాగే తర్వాత ఐదు నెలలు ఒక్కో నెల 200కిలోమీటర్లు వరకూ ప్రయాణించాలని టార్గెట్ పెట్టాం. అలా చేయలేకపోతే రూ.1500చెల్లించాల్సి ఉంటుంద’ని యూరోనిక్స్ సౌత్ హెడ్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి : దేశంలో 6,041 ఒమిక్రాన్ కేసులు