Omicron India : దేశంలో 6,041 ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 6 వేలు దాటింది. ఇప్పటివరకు 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.

Omicron India : దేశంలో 6,041 ఒమిక్రాన్ కేసులు

Omicron (4)

omicron cases in india : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లోనూ విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ భారత్ పై పడగ విప్పాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 6 వేలు దాటింది. ఇప్పటివరకు 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.

మరోవైపు దేశంలో మళ్లీ కరోనా పడగ విప్పింది. రోజు రోజుకూ భారీగా కేసులు పెరుతున్నాయి. దేశంలో కొత్తగా 2,68,833 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 402 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,17,820 యక్టీవ్ కేసులు ఉన్నాయి. భారత్ లో రోజువారీ పాజిటివిటి రేటు 16.66 శాతానికి చేరింది.

Chicken Bettings : తొలి రోజు జోరుగా కోడి పందాలు.. రూ.300 కోట్లకు పైగా చేతులు మారిన డబ్బు

దేశంలో యాక్టీవ్ కేసులు 3.85 శాతానికి చేరుకున్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,68,50,962 కేసులు, 4,85,752 మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి 3,49,47,390 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే దేశంలో కొత్తగా 2,64,202 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి 315 మంది మరణించారు. గత 24 గంటల్లో 1,09,345 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

మరోవైపు భారత్ లో 364 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 73,08,669 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటివరకు 155.39 కోట్ల డోసుల టీకాలు అందజేశారు.