Chicken Bettings : తొలి రోజు జోరుగా కోడి పందాలు.. రూ.300 కోట్లకు పైగా చేతులు మారిన డబ్బు

ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే తొలిరోజు 12వేలకు పైగా పందెం కోళ్లు మృతి చెందాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కాస్త తక్కువగా పందాలు జరిగినా ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం జోరుగా సాగాయి.

Chicken Bettings : తొలి రోజు జోరుగా కోడి పందాలు.. రూ.300 కోట్లకు పైగా చేతులు మారిన డబ్బు

Chicken

Chicken bettings on the first day : హైకోర్టు ఆదేశాలు.. పోలీసుల హెచ్చరికలు జాన్తా నై అన్నారు పందెం రాయుళ్లు.. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ కాళ్లకు కత్తులు కట్టి పందెం పుంజులను బరిలోకి దింపితే.. దెబ్బకు గల్లా పెట్టే గలగలలాడింది.. ఒక్క భోగి రోజే 400కు పైగా బరుల్లో పందెం కోళ్లు తలపడగా.. ఏకంగా 300 కోట్లకు పైగా వరకు డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఇక గుండాటలో 50 కోట్ల వరకు పందాలు జరిగినట్టు సమాచారం..

ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే తొలిరోజు 12 వేలకు పైగా పందెం కోళ్లు మృతి చెందాయి.. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కాస్త తక్కువగా పందాలు జరిగినా ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం జోరుగా సాగాయి కోళ్ల పందాలు.. పెద్ద బరుల్లో ఒక్కో పందెం 50 లక్షలకుపైగా నడుస్తోంది అంటే పందాలు ఏ రేంజ్‌లో నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల వర్షం పడటంతో పందాలకు కాస్త అంతరాయం కలిగింది.

Jallikattu : తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. కరోనా నిబంధనలను పట్టించుకోని నిర్వాహకులు

పందాల్లో పాల్గొనడానికి ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రముఖులు గోదావరి జిల్లాల బాట పట్టారు.. ఈ సారి పెద్ద బరుల్లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల మధ్య పోటీగా కూడా 20 వరకు పందాలు జరిగినట్టు తెలుస్తోంది.. ఈ పందాల్లో గెలిచిన వారికి వెండి నాణెం బహుమతిగా ఇస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే 60 కోడి పందేల్లో ఏ జిల్లా ఎక్కువగా గెలుస్తుందో వారికి ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని ప్రకటించినట్టు తెలుస్తోంది.

ఈసారి కోడి పందాలు హైటెక్‌ పద్ధతిలో సాగాయనే చెప్పాలి. ఫోన్లు, డ్రోన్లు, ఎల్‌ఈడీ స్ట్రీన్లు, రెయిన్‌ ఫ్రూఫ్‌ టెంట్లు.. వాట్‌ నాట్ పందెం బరుల్లోకి వెళితే అన్ని ఫెసిలిటీలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు.. ఇక పందెం కాసే పందెంరాయుళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ ఫెసిలిటీ కూడా కల్పించారు. ఫోన్‌పే ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చెయండి పందెం కాయండి అంటూ బోర్డులు పెట్టిమరీ పందెం రాయుళ్లను ఆహ్వానిస్తున్నారు.

CM KCR : బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ ప్రచారం..?

అయితే ఈ ఏడాది కరోనా కారణంగా వీఐపీల తాకిడి తగ్గింది. అంతేకాదు గతేడాదితో పోలిస్తే పందాలు కూడా తగ్గినట్టు తెలుస్తోంది. గతేడాది పశ్చిమగోదావరి జిల్లాలో భోగి రోజు 400 కోట్లకు పైగా పందాలు జరగగా.. ఈ ఏడాది అది 250 కోట్లకే పరిమితమైనట్టు తెలుస్తోంది.. అంతేగాకుండా కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షం కూడా పందాలకు అడ్డంకిగా మారింది. దీంతో ఈ రోజు రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లను ఏర్పాటు చేసి పందాలను నిర్వహించేందుకు రెడీ అయ్యారు నిర్వాహకులు. సంక్రాంతి కావడంతో ఈ రోజు భారీగా పందాలు జరిగే అవకాశం ఉంది.