India River : ఆ నదిలో నల్లపూస వేసినా స్పష్టంగా కనిపిస్తుంది..భారతదేశంలో స్వచ్చమైన నది

నది నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే ... కాస్త దూరం నుంచి ఆ నదిని చూస్తే నావలు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తాయి.

India River : ఆ నదిలో నల్లపూస వేసినా స్పష్టంగా కనిపిస్తుంది..భారతదేశంలో స్వచ్చమైన నది

Shif

India River Umngot : నదిలో పడవలు గాల్లో తేలడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? అవి నిజంగా తేలకపోయినా..తేలుతున్నట్లుగా కనిపిస్తుండడం విశేషం. కేంద్ర జలశకితి వనరుల శాఖ ట్విట్టర్ లో పోస్టు చేసిన ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత స్వచ్చమైన నదుల్లో ఒకటి అని, భారతదేశంలోనే ఇది ఉందని వెల్లడించింది. ఆ నదిలో పడవ వెళుతోంది. కానీ..ఆ పడవ గాల్లో తేలుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నదిలో నీరు చాలా స్వచ్చంగా, పారదర్శకంగా ఉంటాయని వెల్లడించింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Read More : Covid Cucumber : ఇదేందిరా బాబూ? ఇవి దోసకాయలా? కరోనా వైరసా?..!!

పడవ నీళ్లలో వెళుతుండగా…నది అడుగు భాగంలో ఉన్నది ప్రతిదీ చాలా స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం. షిల్లాంగ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంగోట్ నది ఉంది. నదిలోని నీరు స్వచ్చంగా ఉంటుందని..దేశంలోని నదులన్నీ..ఇలా ఉండాలని ఆశిస్తున్నామని ..హాట్సాఫ్ మేఘాలయ ప్రజలు అంటూ ట్వీట్ లో తెలిపింది.

Read More : వారాంతపు లాక్_డౌన్ దిశగా ఢిల్లీ.! _ Delhi lockdown due to Air Pollution

ఇండియాలో ఉన్న నదులు, ప్రకృతి అందాలు మైమరపిస్తుంటాయి. అందుకే భారతదేశానికి పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. నదులు, సముద్రాలు, సరస్సులు భారతదేశ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. కానీ..ప్రస్తుతం కాలుష్యం కారణంగా..నదులు కలుషితమైపోతున్నాయి. కానీ..మేఘాలయ రాష్ట్రంలో ఉన్న నది ఎంతో స్వచ్చంగా ఉండడం విశేషం. ఆ నది నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే … కాస్త దూరం నుంచి ఆ నదిని చూస్తే నావలు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తాయి. ఆ నదిపై గాలిలో తేలుతున్నట్టు కనిపించే ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతాయి. ఈ నదిని ఆసియాలోనే అత్యంత శుభ్రమైన నదిగా గుర్తించారు.