OnePlus 9 Pro 5G : అమెజాన్‌లో వన్‌ప్లస్ 9ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎంతంటే?

OnePlus 9 Pro 5G : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. చైనా తయారీదారు వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

OnePlus 9 Pro 5G : అమెజాన్‌లో వన్‌ప్లస్ 9ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎంతంటే?

Oneplus 9 Pro 5g Gets A Massive Discount On Amazon, Should You Buy It (2)

OnePlus 9 Pro 5G : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. చైనా తయారీదారు వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ 8GB RAM+128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 47,999 ఆఫర్ చేస్తోంది. OnePlus 9 ప్రో ఫోన్.. వాస్తవానికి భారత్‌లో రూ. 64,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అమెజాన్ ఈ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.17,000 తగ్గింపును అందిస్తోంది. అయితే అమెజాన్ అందించే ఈ డిస్కౌంట్లో ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లు లేవు. Amazonలో రూ. 18,150 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.

అధికారిక OnePlus వెబ్‌సైట్‌లో.. అదనంగా రూ. 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ పొందవచ్చు. ఇంతకీ OnePlus 9 Pro విలువైనదేనా? లేదో ఓసారి ఫీచర్లు, ధర వంటి వివరాలను చెక్ చేసుకోండి. అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్న ఈ OnePlus 9 Pro స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. OnePlus 9 Pro ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. 2021లో భారత మార్కెట్లో లాంచ్ అయింది.

Oneplus 9 Pro 5g Gets A Massive Discount On Amazon, Should You Buy It

Oneplus 9 Pro 5g Gets A Massive Discount On Amazon, Should You Buy It

ఇందులో ప్రత్యేకించి రూ. 45,000 కంటే తక్కువ ధరకు పొందవచ్చు. అందుకు మీరు మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. Amazonలో అందుబాటులో ఉన్న ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా తక్కువ ధరకే పొందవచ్చు. గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ Qualcomm Snapdragon 888 SoCతో వచ్చింది. ఇది ఇప్పటికీ సామర్థ్యం కలిగిన చిప్‌సెట్. కాకపోతే ఈ డివైజ్ కొంత బరువు ఉంటుంది. OnePlus 9 ప్రోలో LTPO డిస్‌ప్లే కూడా ఉంది, యూజర్లకు మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. QHD+ రిజల్యూషన్‌తో భారీ 6.7-అంగుళాల 120Hz AMOLED డిస్ ప్లేతో వచ్చింది.

Oneplus 9 Pro 5g Gets A Massive Discount On Amazon, Should You Buy It (1)

Oneplus 9 Pro 5g Gets A Massive Discount On Amazon, Should You Buy It 

ప్యానెల్ ధృఢమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. జెర్రీరిగ్ ఎవ్రీథింగ్ నిర్వహించిన ఒక టెస్టులో కార్నింగ్ లేటెస్ట్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ ద్వారా వన్ ప్లస్ 9ప్రో డిస్‌ప్లేపై సులభంగా గీతలు పడవని నిరూపించింది. OnePlus కొత్త ఫోన్‌లతో గరిష్టంగా 150W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును అందిస్తోంది, ఇది కేవలం 65W ఛార్జింగ్‌ను మాత్రమే కలిగి ఉంది. కానీ, ఇది ఇప్పటికీ తగినంతగా ఉంది. దాదాపు 35 నిమిషాల్లో 4,500mAh బ్యాటరీని టాప్ అప్ చేయవచ్చు. 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, IP68 రేటింగ్, స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి, డాల్బీ అట్మోస్ సపోర్టు కూడా ఉంది. OnePlus కెమెరా విభాగంలో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

Read Also :   Nokia G21 smartphone: భారత్ లో జీ21 స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన నోకియా, మరో రెండు చిన్న ఫోన్లు కూడా