OnePlus 9RT కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా?

వన్ ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ OnePlus 9RT వస్తోంది. OnePlus 9R ఫోన్‌కు ఇది అప్‌గ్రేడ్ వేరియంట్.. సరికొత్త ఫీచర్లతో అక్టోబర్ 13న లాంచ్ కానుంది.

OnePlus 9RT కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా?

Oneplus 9rt Launch Date Set For October 13

OnePlus 9RT Launch : ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. 2021 ఏడాది ఆరంభంలో లాంచ్ అయిన OnePlus 9R ఫోన్‌కు ఇది అప్‌గ్రేడ్ వేరియంట్.. లాంచ్ కు ముందే ఈ సరికొత్త ఫోన్ (OnePlus 9RT)కు సంబంధించిన ఫొటోలను వన్ ప్లస్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లో క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కంపెనీ T-Seriesలో ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అందించగలదని కంపెనీ టీజ్ చేసింది కూడా. OnePlus 9RT స్మార్ట్ ఫోన్ తో పాటు OnePlus Buds Z2 వచ్చే వారం లాంచ్ కానుంది.

లాంచ్ ఎప్పుడంటే? :
చైనా సోషల్ ప్లాట్ ఫాం Weibo వేదికగా వన్ ప్లస్ OnePlus 9RT ఫోన్ లాంచింగ్ తేదీని ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీన చైనాలో రాత్రి (7:30) గంటలకు లాంచ్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్లో వన్ ప్లస్ 9RT ఫోన్ సహా నెక్స్ట్ జనరేషన్ ట్రూ వైర్ లెస్ స్టీరియో (TWS) ఇయర్ బడ్స్ కూడా లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి కంపెనీ Weiboలో టీజర్ పోస్టు చేసింది. వన్ ప్లస్ తీసుకొచ్చే ఈ OnePlus 9RT స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో కూడా లాంచ్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకూ కంపెనీ ఆధికారికంగా ధృవీకరించలేదు.
Reliance Jio : నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొనే యూజర్లకు జియో బంపర్ ఆఫర్..!

ధర ఎంతంటే? :
OnePlus 9RT స్మార్ట్ ఫోన్ ధర కూడా కంపెనీ ఇప్పటికీ రివీల్ చేయలేదు. కానీ, ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర CNY 2000 (రూ.23,300), కొన్ని చోట్ల CNY 3,000 (రూ. 34,900)గా ఉంటుందని అంచనా. ఇప్పటికే వన్ ప్లస్ కంపెనీ చైనాలో OnePlus 9RT ఫోన్ ప్రీఆర్డర్లను ప్రారంభించింది. అంతేకాదు.. చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం JD.comలో కూడా ఈ కొత్త వన్ ప్లస్ ఫోన్ లిస్టు చేసింది. ఫోన్ డిజైన్ తో పాటు ఫ్రంట్, బ్యాక్ ప్యానెల్ ఫొటోలను కూడా రిలీజ్ చేసింది.
Apple Festive Offer: భారత్‌లో ఐఫోన్ 13 సిరీస్‌పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఫీచర్లు+ స్పెషిఫికేషన్లు (అంచనా) :
OnePlus 9RT ఫోన్ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. 50MP కెమెరా సెన్సార్, Warp Flash ఛార్జ్, 120Hz డిస్‌ప్లే ఉంటాయని అంచనా. స్మార్ట్ ఫోన్ ఇతర ఫీచర్లకు సంబంధించి వివరాలు రివీల్ చేయలేదు. గత నివేదికల ప్రకారం.. OnePlus 9RT ఫోన్.. ఆక్టా-కోర్ క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 888 SoC, 50MP Sony IMX766 కెమెరాలు ఉండొచ్చు. ఈ కెమెరా వన్ ప్లస్ రిలీజ్ చేసిన OnePlus 9, OnePlus 9proలో కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఫుల్ HD+ డిస్ ప్లే, 4,500mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా అందిస్తోంది. టీజర్ ప్రకారం చూస్తే.. వన్ ప్లస్ ఈ కొత్త మోడల్ ను సింగిల్ గ్రే కలర్ ఆప్షన్ మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తోంది.
Apple Watch Series 7 : ఇండియాలో ఈ రోజు నుంచే ఆపిల్ వాచ్ సిరీస్ 7 ప్రీ-ఆర్డర్లు..!