Arms License : ఆన్‌లైన్‌లో.. గన్‌ లైసెన్సులు

గతంలో గన్ లైసెన్స్ పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా లైసెన్స్ కి దరఖాస్తు చేసుకునే వెసులుపాటు కల్పించింది ప్రభుత్వం.

Arms License : ఆన్‌లైన్‌లో.. గన్‌ లైసెన్సులు

Arms License

Arms License : గతంలో గన్ లైసెన్స్ పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. అటువంటి విధానానికి చెక్ పెట్టి ఆన్‌లైన్‌ ద్వారా లైసెన్స్ కి దరఖాస్తు చేసుకునే వెసులుపాటు కల్పించింది కర్ణాటక ప్రభుత్వం. గురువారం రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర సంబంధిత అప్లికేషన్‌ను లాంఛనంగా విడుదల చేశారు. గన్‌ లైసెన్సులు తీసుకోవాలి అనుకునే వారు ఆన్‌లైన్‌ ద్వారానే పొందాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని ప్రస్తుతానికి బెంగళూరు పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. భవిష్యత్ లో దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌.

Read More :  Afganistan-China : తాలిబన్ ప్రభుత్వానికి చైనా భారీ సాయం

ఫీజుల చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే చేపట్టవచ్చన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన అప్లికేషన్‌ ద్వారా కొత్తగా గన్‌ లైసెన్సులు, రెన్యూవల్స్‌, ప్రయాణాల సమయంలో గన్‌ల వినియోగం, ఆయుధాలు మార్చుకుంటే కొత్త లైసన్సులు, అదనపు గన్‌లు పొందేందుకు, తుపాకిని విక్రయించేందుకు, బదిలీలు, వ్యవధి పొడగింపు, చిరునామా మార్పులు, లైసెన్సు వద్దనుకుంటే వాపసు చేయడం వంటి సేవలు ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు అన్నారు. ఇక ఇప్పటి వరకు 8,138 మందికి నగర పరిధిలో గన్‌ లైసెన్సులు ఇచ్చామన్నారు.

Read More : Whatsapp: వాట్సాప్‌లో ‘రూపాయి’ సింబల్‌ ఫీచర్‌ చూశారా?