Oppo Find N2 Flip Price : శాంసంగ్‌కు పోటీగా.. అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో మడతబెట్టే ఫోన్.. ధర ఎంతో తెలుసా? అప్పటివరకూ ఆగాల్సిందే..!

Oppo Find N2 Flip Price : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ గత ఫిబ్రవరిలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. అయితే, ఈ ఫోన్ ధర ఎంత అనేది మాత్రం కంపెనీ రివీల్ చేయలేదు.

Oppo Find N2 Flip Price : శాంసంగ్‌కు పోటీగా.. అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో మడతబెట్టే ఫోన్.. ధర ఎంతో తెలుసా? అప్పటివరకూ ఆగాల్సిందే..!

Oppo Find N2 Flip price to be revealed on March 13

Oppo Find N2 Flip Price : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ (Oppo Find N2 Flip) గత ఫిబ్రవరిలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. అయితే, ఈ ఫోన్ ధర ఎంత అనేది మాత్రం కంపెనీ రివీల్ చేయలేదు. త్వరలో ఈ ఫోల్డబుల్ ధరను త్వరలో వెల్లడిస్తానని ప్రకటించింది. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో కూడా పోస్ట్‌ షేర్ చేసింది. ఒప్పో Find N2 Flip ఫోన్ ధరను మార్చి 13న ప్రకటిస్తామని ఒప్పో తెలిపింది.

భారతీయ యూజర్ల కోసం ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ అవుతుందా? లేదా అనేది Oppo ధృవీకరించలేదు. గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్ అయిన Oppo Find N2 ఫ్లిప్ ఫోన్ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంది. ఇంటర్నల్ మారిసిలికాన్ X NPU, హాసెల్‌బ్లాడ్ నేచరుల్ కలర్ టోన్‌లతో హై-రిజల్యూషన్ కెమెరా సెన్సార్‌లను అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy Z Flip) సిరీస్ ఫోన్‌లకు పోటీగా.. (ఒప్పో ఫైండ్ N2 Flip) 60Hz రిఫ్రెష్ రేట్‌తో 3.6-అంగుళాల OLED ఔటర్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్టుతో 6.8-అంగుళాల AMOLED LTPO ప్యానెల్ ఇన్నర్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 9000 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ గరిష్టంగా 16GB RAM, 512GB స్టోరేజీని అందిస్తుంది. CNY 6,000 (సుమారు రూ. 71వేలు) ప్రారంభ ధరతో వస్తుంది. ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్‌ని గ్లోబల్ మార్కెట్‌లకు తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

Oppo Find N2 Flip price to be revealed on March 13

Oppo Find N2 Flip price to be revealed on March 13

ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 191 గ్రాములు. కెమెరా ముందు భాగంలో 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీల కోసం Find N2 ఫ్లిప్ ఫోన్ ముందు భాగంలో 32MP కెమెరాను కలిగి ఉంది. 50MP Sony IMX890 ప్రధాన సెన్సార్ ఆల్-పిక్సెల్ ఓమ్నిడైరెక్షనల్ ఇంటెలిజెంట్ ఫోకసింగ్‌ను కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. 4K వీడియోగ్రఫీ కోసం.. కెమెరా హార్డ్‌వేర్-లెవల్ DOL-HDRకి సపోర్టు ఇస్తుంది.

ఒకే సమయంలో షార్ట్ లాంగ్-ఎక్స్‌పోజర్ ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4,300mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 44 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. అయితే IP రేటింగ్ లేదు. ColorOS 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. ఒప్పో కంపెనీ ప్రకటించినట్లుగా.. ఒప్పో ఫైండ్ N2 Flip ఫోన్ 4 ఏళ్ల Android 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకోనుంది.

Read Also : Moto G62 Price Cut : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G62 ధర తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ 5G ఫోన్ కొనాల్సిందే.. మరెన్నోక్యాష్‌బ్యాక్ ఆఫర్లు!