NFHS : 70 % మహిళలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు: NFHS సర్వే

భారత్ లో 70శాతం మంది మహిళలు..కుటుంబంలో తమపై జరుగుతున్న హింసను మౌనంగా భరిస్తున్నారు తప్ప బయటకు చెప్పుకోరని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది.

NFHS : 70 % మహిళలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు: NFHS సర్వే

Women Violence

women  never told anyone about violence experienced : సాధారణంగా మహిళలు తమ భర్త తిట్టినా..కొట్టినా..ఎంతగా హింసిస్తున్నా బయటకు చెప్పుకోరు. కుటుంబ పరువు పోతుందని.. నలుగురిలో చులకన అయిపోతామని..ఎంతగా హింసిస్తున్నా బయటకు చెప్పుకోరు. తమపై జరుగుతున్నశారీరక హింసను మౌనంగానే భరిస్తు..మనసస్సులోనే రోదిస్తుంటారు. ఇది కుటుంబ పరువు కోసం మానసక..శారీరక హింసల్ని భరిస్తుంటారు. ఈ విషయాన్ని సాక్షాత్తు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఇలా బాధల్ని భరించేవారు తమ ప్రాణంమీదకు వచ్చినా బయటకు చెప్పి సహాయం తీసుకోవానికి కూడా వెనుకాడతారని..ఇటువంటి పరిస్థితి ఏపీ, తెలంగాణలో కూడా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది.

Read more :Husband Beating Wife : మొగుడు..పెళ్లాన్ని కొట్టడం కరక్టేనా?సర్వేలో మహిళల దిమ్మతిరిగే సమాధానం 

భారత్ లోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 70 శాతానికిపైగా మహిళలు తమపై జరుగుతున్న హింసను మౌనంగా భరిస్తున్నారు తప్ప..తమ బాధను ఎవరికీ చెప్పుకోవడం లేదని..ప్రాణంమీదకు వచ్చినా..ఎవరి సాయమూ తీసుకోవటానికి కూడా ఇష్టపడటంలేదని కుటుంబ సర్వే తెలిపింది. సాధారణంగా మహిళలు కుటుంబ పరువు కోసం ఇంటి యజమాని కంటే (భారత్ లో కుటుంబ యజమని అంటే పురుషులే ఉంటారు) ఎక్కువ ఆలోచిస్తారు. దీంట్లో భాగంగానే మహిళలు తమ భర్త కొట్టినా..తిట్టినా..హింసిస్తున్నా బయటకు చెప్పుకోరు. కుటుంబం పరువు పోతుందని..సమాజంలో చులకన అవుతారని. ఇది కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాదు భారత్ లో మహిళలు ఎక్కువ శాతం ఇలాగే ఉంటారు.

అలా తాము హింసకు గురవుతున్నా ఎవరికీ చెప్పుకోకుండా తమలో తామే కుమిలిపోతున్న మహిళల సంఖ్య అస్సాంలో 81.2 శాతం ఉంటే బీహార్‌లో 81.8 శాతం, మణిపూర్‌లో 83.9 శాతం, సిక్కింలో 80.1 శాతం, జమ్మూకశ్మీర్‌లో 83.9 శాతం ఉన్నట్టు సర్వేలో వెలుగుచూసింది.

Read more : రోజుకు 87 అత్యాచారాలు..మహిళలపై హింస పెరుగుతోంది

70 శాతానికిపైగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ (79.7 శాతం), తెలంగాణ (71 శాతం), త్రిపుర (76 శాతం), పశ్చిమ బెంగాల్ (76.3 శాతం), మహారాష్ట్ర (76.4 శాతం), గోవా (75.7 శాతం), గుజరాత్ (70.6 శాతం) ఉన్నాయి.

తాము ఎదుర్కొంటున్నశారీరక హింస నుంచి బయటపడేందుకు సాయాన్ని కోరే మహిళల సంఖ్య 10 శాతం లోపే ఉండడం గమనించాల్సిన విషయం. అస్సాంలో 6.6 శాతం మంది మహిళలు సాయాన్ని అర్థిస్తే, ఏపీలో 7.7, బీహార్‌లో 8.9, గోవాలో 9.6, హిమాచల్ ప్రదేశ్‌లో 9.6, జమ్మూకశ్మీర్‌లో 7.1, మణిపూర్‌లో 1.2, నాగాలాండ్‌లో 4.8 శాతం మంది మహిళలు సాయం కోరారు. మహిళలు ఎదుర్కొంటున్న హింసలో శరీరంపై కోతలు, నొప్పులు, కంటిగాయాలు, ఎముకలు విరగడం, తీవ్రమైన కాలిన గాయాలు, విరిగిన పళ్లు, ఎముకల స్థానభ్రంశం వంటి ఉన్నాయని ఎన్ఎఫ్‌హెచ్ఎస్ వెల్లడించింది.