Gopichand : పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టలో తెలుసా??

గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో GA2 బ్యానర్ పై.........

Gopichand : పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టలో తెలుసా??

Pakka Commercial

Pakka Commercial :  గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో GA2 బ్యానర్ పై బన్నీ వాసు, SKN కలిసి నిర్మించగా జులై 1న థియేటర్లలో రిలీజ్ అవ్వబోతుంది. మారుతి జోనర్ లోనే కామెడీకి యాక్షన్ కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ప్రమోషన్స్ వీర లెవల్లో చేశారు. ఇక థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి.

పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

నైజాం – 6 కోట్లు

సీడెడ్ – 2.50 కోట్లు

ఆంధ్ర – 9 కోట్లు

మొత్తంగా తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ.17.50 కోట్ల బిజినెస్ చేసింది.

రెస్టాఫ్ భారత్ – 0.50 కోట్లు

ఓవర్సీస్ – 1.20 కోట్లు

SSMB 29 : ప్యారిస్ ఫేమస్ 3డి యానిమేషన్ స్టూడియోలో రాజమౌళి.. మహేష్ సినిమా కోసమేనా??

పక్కా కమర్షియల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ అనిపించుకోవాలంటే బాక్సాపీస్ దగ్గర 20 కోట్లు రాబట్టాలి. గోపీచంద్ గత సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. మరి ఏ రేంజ్ లో కలెక్షన్స్ కురుస్తాయో చూడాలి.