Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఇది పక్కా గ్లామర్ షో బాసు!

సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ ఇటీవల షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాలో హీరో గోపీచంద్...

Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఇది పక్కా గ్లామర్ షో బాసు!

Pakka Commercial To Have Three Beauties

Pakka Commerical: సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ ఇటీవల షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాలో హీరో గోపీచంద్ నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్, టీజర్, తాజాగా ట్రైలర్‌లతో సందడి చేస్తోంది పక్కా కమర్షియల్ టీమ్. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే, ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.

Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఇది నాన్-కమర్షియల్ అంటోన్న చిత్ర యూనిట్!

ముఖ్యంగా ఈ సినిమాలో గోపీచంద్ కామెడీతో ప్రేక్షకులను అలరించే విధానం ఈ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూసినవారు చెబుతున్నారు. ఇక మరో హైలైట్‌గా ఈ సినిమాలో గ్లామర్ డోస్ ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశి ఖన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కాకుండా ఈ సినిమాలో మరో ముగ్గురు భామలు కూడా నటిస్తున్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

Pakka Commercial : డబ్బుల కోసమే పని చేసే లాయర్.. పక్కా కమర్షియల్ ట్రైలర్ రిలీజ్..

ఆమెతో పాటు ‘నేనింతే’ ఫేం బ్యూటీ అదితి గౌతమ్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుందని.. ఆమెతో పాటు మరో బ్యూటీ చిత్రా శుక్లా కూడా ఈ సినిమాలో మెరవనుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇలా హీరోయిన్ కాకుండా మరో ముగ్గురు భామలు ఈ సినిమాలో నటిస్తున్నారంటే, వారి గ్లామర్ షోతో పాటు పర్ఫార్మెన్స్‌లకు మారుతి ఎలాంటి ప్రాముఖ్యతను ఇచ్చాడా అనే ఆసక్తి అభిమానుల్లో క్రియేట్ అవుతుంది. ఇక జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తారా అనేది అప్పుడే ఆసక్తికరంగా మారింది.