Pallavi Joshi : కశ్మీర్ ఫైల్స్ నటికి షూటింగ్‌లో గాయాలు.. అయినా షూటింగ్ పూర్తి చేసిన నటి..

ఈ 'ది వ్యాక్సిన్ వార్' సినిమాలో పల్లవి జోషి కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఒక కార్ చేజింగ్ సీన్ షూట్ చేస్తుండగా వాహనం అదుపు తప్పి పల్లవిజోషికి.............

Pallavi Joshi : కశ్మీర్ ఫైల్స్ నటికి షూటింగ్‌లో గాయాలు.. అయినా షూటింగ్ పూర్తి చేసిన నటి..

Pallavi Joshi injured while movie shooting

Pallavi Joshi : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశమంతటా ప్రేక్షకులని మెప్పించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాలో డైరెక్టర్ వివేక్ భార్య, నటి పల్లవి జోషి కూడా ఓ ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది. పల్లవి మరాఠి, గుజరాతి, హిందీ భాషల్లో చాలా సినిమాల్లో నటించింది. నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ నటి. ప్రస్తుతం డైరెక్టర్ వివేక్ ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

NTR : తారక్‌తో ఇండియన్ క్రికెటర్లు.. వైరల్ అవుతున్న ఫొటో

ఈ ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలో పల్లవి జోషి కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఒక కార్ చేజింగ్ సీన్ షూట్ చేస్తుండగా వాహనం అదుపు తప్పి పల్లవిజోషికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా కూడా పల్లవి తన షూట్ పూర్తి చేసి హాస్పిటల్ కి వెళ్ళింది. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కంగారు పడాల్సిందేమి లేదని, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. దీంతో ఆమె అభిమానులు, పలువురు నెటిజన్లు పల్లవి జోషి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.