Release Clashes: ఇండియన్ సినిమాకి పాన్ ఇండియా ప్రాబ్లమ్స్..!

వాళ్లకు వాళ్లు పోటీ కాకుండా జాగ్రత్తగా రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటోన్న ఇండియన్ ఇండస్ట్రీలకు ఇప్పుడో కొత్త తలనొప్పి తయారైంది. పక్క రాష్ట్రాల సినిమాలు కూడా అన్ని భాషల్లో దండయాత్ర..

Release Clashes: ఇండియన్ సినిమాకి పాన్ ఇండియా ప్రాబ్లమ్స్..!

Release Clashes (1)

Release Clashes: వాళ్లకు వాళ్లు పోటీ కాకుండా జాగ్రత్తగా రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటోన్న ఇండియన్ ఇండస్ట్రీలకు ఇప్పుడో కొత్త తలనొప్పి తయారైంది. పక్క రాష్ట్రాల సినిమాలు కూడా అన్ని భాషల్లో దండయాత్ర స్టార్ట్ చేస్తుండటంతో.. కలెక్షన్స్ పై గండి పడేలా కనిపిస్తోంది. ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాక.. మేమూ అదే డేట్ కు ఫిక్సయ్యామని సీరియస్ కబురు కూల్ గా చెప్పడంతో మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు.

Theater Release Films: జోరు తగ్గిన స్టార్స్.. ఈ వారం సంపూ, రాజ్ తరుణ్‌లదే !

డిసెంబర్ 2న థియేటర్స్ దద్దరిల్లాల్సిందే అన్నట్టు ఫుల్ సౌండ్ తో ట్రైలర్ రిలీజ్ చేసారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి, బాలయ్య కాంబో మూవీల్లానే సేమ్ అఖండ కూడా తయారవడంతో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అఖండ దెబ్బకు వరుణ్ తేజ్.. నాని డేట్ లో కెళ్తే.. నటసింహతో పోటీపడేందుకు మోహన్ లాల్ రెడీఅయ్యారు. కీర్తి సురేశ్, అర్జున్, సునీల్ శెట్టి వంటి స్టార్స్ నటించిన మరక్కర్ డిసెంబర్ 2న అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది. అఖండకు పోటీ అన్ని చెప్పలేం కానీ 100కోట్ల గ్రాండియర్ లుక్, భారీ క్యాస్టింగ్ చూస్తుంటే ఏ సెంటర్స్ లో కొంచెం కలెక్షన్స్ అటు ఇటయ్యే ఛాన్స్ ఉంది.

Burj Khalifaపై సెలెబ్రిటీల హల్చల్.. ఈ కథేంటి?

డిసెంబర్ 17న సోలోగా ప్లాన్ చేసుకున్న పుష్పకు పోటీగా దూకబోతున్నాడు స్పైడర్ మ్యాన్. ఇప్పటికే పుష్ప సినిమాను హై స్వింగ్ లో ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. బన్నీ మూవీ మీద ఎంత హైప్ ఉన్నా.. అటు స్పైడర్ మాన్ కోసం వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆటొమేటిక్ గా ఎదురుచూస్తారు. బన్నీ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా లెవెల్ లో వెళ్తున్నారు. ఆంధ్ర, కేరళలో పుష్పకు ఎటువంటి నష్టం ఉండకపోవచ్చు. కానీ హిందీ, తమిళ మార్కెట్లలో స్పైడర్ మాన్ గట్టిగా దెబ్బ కొట్టే అవకాశం లేకపోలేదు. అసలే హాలీవుడ్ మూవీ.. అందులోను స్పైడర్ మాన్ కాబట్టి భారీ కలెక్షన్సే వాళ్ల టార్గెట్. ఏదేమైనా ఏ క్లాస్ ఆడియన్స్ కొందరు స్పైడర్ మ్యాన్ వైపు వెళ్లినా.. మాస్ జనం పుష్పకు పుష్కలంగా కదిలొచ్చే అవకాశాలే బోలెడు.

Prashanth Neel: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. ప్రశాంత్ లైనప్ అదిరిందంతే!

డిసెంబర్ 24… రెండు సినిమాల ఓటీటీ రిలీజ్ తర్వాత నాని చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో శ్యామ్ సింగ రాయ్ ను థియేటర్స్ లో వదులుతున్నాడు. తీరా చూస్తే అఖండ దెబ్బకు వరుణ్ తేజ్ గని వచ్చి నానికి పోటీగా మారింది. ఎవరికి వారే ధీమాతో కనిపిస్తున్నారు కానీ కలెక్షన్స్ ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. వీళ్లిద్దరూ కాదన్నంటూ కల్యాణ్ రామ్ బింబిసార కూడా డిసెంబర్ 24నే ఫోకస్ చేసిందనే పుకారు వినిపిస్తోంది. ఇక సేమ్ డే.. రణ్ వీర్ సింగ్ 83 పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. వరల్డ్ కప్ బ్యాక్ డ్రాప్ తో సూపర్ స్టోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా రాబోతుంది.

Chiranjeevi: ఒకేసారి 5 సినిమాలు.. ఎప్పుడూ లేనంత బిజీగా మెగాస్టార్!

ఫిబ్రవరి 4న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది ఆచార్య. ఎన్నో వాయిదాల తర్వాత 2022లోనే రావడం సేఫ్ అనుకున్నారు మేకర్స్. చిరూ, చరణ్ మల్టీస్టారర్.. కొరటాల శివ డైరెక్షన్ ఈ సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. అయితే ఇదే రోజు జై భీమ్ తో సూపర్ హీరో అనిపించుకున్న సూర్య సినిమా థియేటర్స్ కి రాబోతుంది. ఫిబ్రవరి 4నే ఎతర్కుమ్ తునిన్దవన్ రిలీజ్ కాబోతుంది. ప్రాక్టికల్ గా చూస్తే చిరూ, చరణ్ ఆచార్యకిది పెద్ద పోటీ కాదు ఎందుకంటే సూర్య గత థియేట్రికల్ రిలీజ్ లకు మన దగ్గర పెద్ద ఓపెనింగ్స్ రాలేదు. కానీ జై భీమ్ తో ఒక్కసారిగా మళ్లీ సూపర్ స్టార్ గా మారడమే కాదు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సూర్యకి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సో.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో బలంగా తీసుకెళ్లాలనుకున్న ఆచార్యకు సూర్య పోటీఅయ్యే అవకాశం ఉంది.

RRR: నాటు పాటకి పునీత్ స్టెప్పులేస్తే.. వీడియో వైరల్!

ఇక ఎప్పటి నుంచో సౌత్ టు నార్త్ ఆడియెన్స్ వెయిట్ చేస్తోన్న సినిమా కేజీఎఫ్ 2. ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది కన్నడ రాక్ స్టార్ సినిమా. అయితే ఉన్నట్టుండి ఇదే రోజుకు ఆమీర్ సినిమా లాల్ సింగ్ చద్దా పోస్ట్ పన్ అయింది. ఇది నిజంగా కేజీఎఫ్ 2కి నష్టమే. ఎందుకంటే ఆమీర్ సినిమా అంటే బాలీవుడ్ ప్రేక్షకులు ఫుల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు. ఇదే సినిమాలో నాగ చైతన్య కీ రోల్ చేస్తుండటంతో ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ లాల్ సింగ చద్దా కోసం చూస్తున్నారు. అన్నీ లాంగ్వెజెస్ లోనూ ఆమీర్ సినిమా రాబోతుంది. సో లాల్ సింగ్ చద్దా, కేజీఎఫ్ 2కి ముఖ్యంగా నార్త్ లో సవాల్ విసురుతుంది అనడంలో సందేహమే లేదు.