Chiranjeevi: ఒకేసారి 5 సినిమాలు.. ఎప్పుడూ లేనంత బిజీగా మెగాస్టార్!

నాన్ స్టాప్ 4 సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి.. లేటెస్ట్ గా మరో కొత్త సినిమాని తన లైనప్ కి యాడ్ చేసుకుంటున్నాడు. లేట్ అయినా సరే సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవి..

Chiranjeevi: ఒకేసారి 5 సినిమాలు.. ఎప్పుడూ లేనంత బిజీగా మెగాస్టార్!

Chiranjeevi

Chiranjeevi: నాన్ స్టాప్ 4 సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి.. లేటెస్ట్ గా మరో కొత్త సినిమాని తన లైనప్ కి యాడ్ చేసుకుంటున్నాడు. లేట్ అయినా సరే సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవి.. సూపర్ స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమాకి మరో సినిమాకి మినిమమ్ గ్యాప్ లేకుండా ఒకేసారి 5 సినిమాలతో ఎప్పుడూ లేనంత బిజీగా నంబర్ ఆఫ్ సినిమాల్ని లైనప్ చేశాడు. నిజానికి రీసెంట్ గా చరణ్ కి స్టోరీ చెప్పిన డైరెక్టర్ తో చిరంజీవి లేటెస్ట్ గా సినిమా కమిట్ అయ్యాడు.

RRR: నాటు పాటకి పునీత్ స్టెప్పులేస్తే.. వీడియో వైరల్!

లేటెస్ట్ గా మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములకి ఛాన్సిచ్చాడు చిరంజీవి. ఈ యువదర్శకుడు కొడుక్కి కథ చెప్పి.. తండ్రితో సినిమా ఓకే చేయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ స్టార్ అయినా కూడా.. నిదానంగా ఒక దాని తర్వాత ఒకటి చేస్కోవచ్చులే అనుకోకుండా.. ప్యార్లల్ గానే షూటింగ్ చేస్తున్నాడు మెగాస్టార్. ఒక వైపు ఆచార్య సినిమాని కంప్లీట్ చేసి ఫిబ్రవరి రిలీజ్ కు రెడీ చేస్తూనే.. మరోవైపు మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు చిరంజీవి.

Poonam Kaur: పంజాబీ అందం పూనమ్ గ్లామర్ ట్రీట్!

ఇలా ఒకవైపు ఆచార్య, మరోవైపు గాడ్ ఫాదర్ సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్.. మోహర్ రమేష్ కాంబినేషన్ లో రీసెంట్ గా స్టార్ట్ అయిన భోళా శంకర్ సినిమాని కోకాపేట్ లో షూటింగ్ చేస్తున్నారు. మరోవైపు బాబీతో అనౌన్స్ చేసిన 154వ సినిమా వాల్తేరు శీను సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకుంది. ఇలా చిరంజీవి ఆల్రెడీ 4 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే వెంకీ కుడుములతో 5వ సినిమాని కూడా అప్పుడే క్యూలో పెట్టేశాడు. డివివి ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో ఈ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కబోతోంది. సీనియర్ హీరోలలో ఇలా ఇంత బిజీగా ఉన్న హీరో చిరు ఒక్కడేనేమో!