Parliament : రైతు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం – Live Updates

పార్లమెంట్ వింటర్ సెషన్- తొలిరోజు రచ్చరచ్చే..! - Live Updates

Parliament : రైతు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం  – Live Updates

Parliament

Updated On : November 29, 2021 / 3:16 PM IST

Parliament Winter Session : ఉదయం 11 గంటలకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 23 వరకు సమావేశాలు కొనసాగుతాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. మీడియా ప్రవేశం పైనా పలు ఆంక్షలు విధించారు. కీలకమైన వ్యవసాయ చట్టాలను రద్దు సహా మొత్తం 26 కీలక బిల్లులను శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

లోక్ సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. బిల్లును లోక్ సభ చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించింది. వెంటనే రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ బిల్లును ఆమోదించింది. దీంతో… రైతు చట్టాల రద్దు బిల్లు పార్లమెంట్ గడప దాటింది. రద్దు వ్యవహారంలో రెండు కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. ఇక రాష్ట్రపతి ఆమోదమే తరువాయి. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా వ్యవసాయం, రైతుల కోసం కొత్తగా కమిటీ ఏర్పాటును ప్రకటించనున్నారు ప్రధాని మోడీ.