TTD : తిరుమల పవిత్రోత్సవాలు..అంకురార్పణ
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో పవిత్రోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 17వ తేదీ అంకుర్పారణ జరిగింది.

Ttd Tirumala
Pavithrotsavam : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో పవిత్రోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 17వ తేదీ అంకుర్పారణ జరిగింది. ఆగస్టు 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు (మూడు రోజులు) పవిత్రోత్సవాలు జరుగనున్నాయని అధికారులు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..ఈ ఉత్సివాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా..మూడు రోజుల పాటు..ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు.
Read More : Afghanistan : ఆఫ్ఘానిస్తాన్‌లో సాధారణ వాతావరణం నెలకొంటుందా?
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వార్లను అందంగా ఆభరణాలతో అలంకరించి…ఆలయ మాడ వీధుల్లో ఊరేగించనున్నారు. ఆగస్టు 18వ తేదీన పవిత్రాల ప్రతిష్ట, 19వ తేదీన పవిత్ర సమర్పణ, 20వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక పవిత్రోత్సవాల సందర్భంగా..సహస్రదీపాలంకర సేవను టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకర సేవలను రద్దు చేయడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Read More : Congress Protest : ‘ట్విట్టర్ పక్షి’ని వండుకుని తిన్న కాంగ్రెస్ నేతలు
పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయని అంటుంటారు. 1962 సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించిందని పండితులు వెల్లడిస్తున్నారు. సంవత్సరం పొడవునా..ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలు, యాత్రికులు, ఇతర సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రకు లోపం కలుగుతుందని అందుకే ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిచడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ పండితులు వెల్లడించారు.