Vakeel Saab: రెండున్నర గంటల సినిమాలో పవన్ ఉండేది యాభై నిమిషాలే?

ఒరిజినల్ పింక్ సినిమాను దృష్టిలో పెట్టుకొని వకీల్ సాబ్ లో పవన్ పాత్ర నిడివిపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. 2 గంటల 16 నిమిషాల నిడివిగల పింక్ ఒరిజినల్ సినిమాలో అమితాబ్ పాత్ర ఉండేది నలభై నిమిషాలే.

Vakeel Saab: రెండున్నర గంటల సినిమాలో పవన్ ఉండేది యాభై నిమిషాలే?

Pawan Kalyan Screen Time Was Fifty Minutes In Vakeel Saab

Vakeel Saab: ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కరోనా భయం వెంటాడుతున్నా.. ఒకవైపు రెండు రాష్ట్రాలలో ఉప ఎన్నికలు రాజకీయాలలో వేడి పెంచేస్తుంటే.. సినిమాలలో వకీల్ సాబ్ ఇంట్రెస్ట్ పెంచేస్తుంది. సహజంగానే పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు ఒక శిఖరంలా కనిపిస్తాడు. అలాంటిది చాలా కాలం నుండి ఆకలిగా ఉన్న మెగా అభిమానుల ముందుకు త్వరలోనే వకీల్ సాబ్ గా వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా క్రేజ్ పీక్స్ కు చేరింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అది తారాస్థాయికి చేరిందనే చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 9న ఈ సినిమా విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేసుకుంటుంది.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తొలి వారంలో వసూళ్లను రాబట్టుకొనేంత క్రేజ్ అయితే ఈ సినిమా ఇప్పటికే క్రియేట్ చేసేసుకుంది. ఎలాగూ పింక్ రీమేక్ కనుక దాదాపు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే.. అదే ఒరిజినల్ పింక్ సినిమాను దృష్టిలో పెట్టుకొని వకీల్ సాబ్ లో పవన్ పాత్ర నిడివిపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. 2 గంటల 16 నిమిషాల నిడివిగల పింక్ ఒరిజినల్ సినిమాలో అమితాబ్ పాత్ర ఉండేది నలభై నిమిషాలే. కాగా తెలుగులో పలు మార్పులు, చేర్పులతో వకీల్ సాబ్ సినిమా రెండున్నర గంటలకు చేరినట్లుగా తెలుస్తుంది.

అయితే మొత్తం రెండున్నర గంటల సినిమాలో పవన్ పాత్ర ఎంతసేపు ఉండనుందని అభిమానులలో కూడా కాస్త క్యూరియాసిటీ మొదలైంది. సహజంగా స్టార్ హీరోల సినిమాలలో హీరో పాత్రకే ఎక్కువ టైం ఉంటుంది. కానీ వకీల్ సాబ్ సినిమా కథాపరంగా ముగ్గురు అమ్మాయిల కథ. అందుకే సినిమా మొత్తం వారి చుట్టూనే తిరుగుతుంది. అందులో పవన్ పాత్ర సినిమాలో కీలకం కాగా పవన్ కనిపించిన ప్రతిసారి సినిమా హైట్స్ ఆకాశాన్ని తాకేలా డిజైన్ చేసుకున్నారట. ఒరిజినల్ కథకు కొంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జతచేసిన దర్శకుడు మొత్తం పవన్ పాత్ర సమయాన్ని యాభై నిమిషాలకు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ యాభై నిమిషాల సమంయంలోనే పవన్ మెరుపులు చూస్తారని సినిమా యూనిట్ ధీమాగా చెప్తుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో మరో నాలుగు రోజులు ఆగితే తెలియనుంది!