Pawan Kalyan : సముద్రఖని దర్శకత్వంలో పవన్ సినిమా.. మరో రీమేక్..

సముద్రఖని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. నా లాంటి అభిమానులని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తాను. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్................

Pawan Kalyan : సముద్రఖని దర్శకత్వంలో పవన్ సినిమా.. మరో రీమేక్..

Pawan

Samuthirakani : తమిళ్ లో సముద్రఖని, తంబి రామయ్య ప్రధాన పాత్రలుగా ‘వినోదాయ సీతాం’ అనే సినిమా సముద్రఖని దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవ్వగా మంచి విజయం సాధించింది. అనుకోకుండా చనిపోయిన ఓ వ్యక్తికి యముడు మనిషి రూపంలో కనిపిస్తే తను నెరవేర్చిల్సిన బాధ్యతలు ఉన్నాయి బతికించమని కోరగా అతన్ని బతికించి అతనితో పాటే ఉంటూ అన్ని పనులు పూర్తయ్యాక మళ్ళీ అతన్ని తీసుకెళ్ళిపోతాడు. కామెడీ, ఎమోషనల్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంది.

గత కొన్ని రోజులుగా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరమ్ తేజ్ నటించనున్నాడు అని టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సముద్రఖని. తాజాగా రిలీజ్ అయిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో సముద్రఖని విలన్ గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల యిచ్చిన ఓ ఇంటర్వ్యూలో వినోద సీతాం రీమేక్ గురించి అడగగా సముద్రఖని దీనిపై మాట్లాడారు.

Sreekanth Reddy : కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది.. డబ్బులు ఇవ్వలేదనే కొట్టింది..

సముద్రఖని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. నా లాంటి అభిమానులని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తాను. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తాము. తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్‌లో మార్పులు చేస్తున్నాము అని తెలిపారు. దీంతో పవన్ సముద్రఖని దర్శకత్వంలో వినోద సీతాం రీమేక్ చేయనున్నట్టు క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పటికే తెలుగులో డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు మళ్ళీ రీమేక్ అవసరమా?, ఇప్పటికే పవన్ ఆయన రేంజ్ కి తగని రీమేక్ సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ రీమేక్ సినిమాలు అవసరమా? అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.