Pawan Upcoming Film: పవన్ కోసం వంశీ పైడిపల్లిని లాక్ చేసిన దిల్ రాజు?

మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ దద్దరిల్లింది. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా థియేటర్లలో వకీల్ సాబ్ మేనియా కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మరీ తీవ్రంగా మారిపోయాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కష్టమైంది. అందుకే ఈరోజే వకీల్ సాబ్ ఓటీటీలో వచ్చేస్తున్నాడు.

Pawan Upcoming Film: పవన్ కోసం వంశీ పైడిపల్లిని లాక్ చేసిన దిల్ రాజు?

Pawan Upcoming Film Dil Raju Locked Director Vamsi Paidipally For Pawan

Pawan Upcoming Film: మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ దద్దరిల్లింది. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా థియేటర్లలో వకీల్ సాబ్ మేనియా కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మరీ తీవ్రంగా మారిపోయాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కష్టమైంది. అందుకే ఈరోజే వకీల్ సాబ్ ఓటీటీలో వచ్చేస్తున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడగా ప్రస్తుతం ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్ వచ్చినా పవన్ కోలుకునేందుకు కొద్దిగా సమయం తీసుకుంటున్నారని తెలుస్తుంది.

కరోనా కారణంగానే పవన్ తదుపరి సినిమాలకు ఆటంకం ఏర్పడింది. పరిస్థితులు చక్కబడితే తప్ప మళ్ళీ షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదు. అయ్యపనుం కోషియుమ్ రీమేక్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరహర వీరమల్లు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా.. వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్ సమయంలోనే నిర్మాత దిల్ రాజు ఒక మాట చెప్పారు. పవన్ తో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కాగా.. ఇందుకోసం దిల్ రాజు పనులు కూడా మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం కథల ఎంపిక మొదలుపెట్టిన దిల్ రాజు దర్శకుడు వంశీ పైడిపల్లిని లైన్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. వంశీతో దిల్ రాజుకు మంచి రాంపో ఉంది. ఇప్పటి వరకు వంశీ తెరకెక్కించిన ఐదు సినిమాలలో నాలుగు సినిమాల నిర్మాణంలో దిల్ రాజు ఉన్నాడు. మున్నా, బృందావనం, ఎవడు సినిమాలను దిల్ రాజు నిర్మించగా.. మహేష్ మహర్షి సినిమాను మరో ముగ్గురు నిర్మాతలతో కలిసి నిర్మించాడు. కాగా తదుపరి సినిమాను తనతో చేయాలని ఇప్పటికే లాక్ చేసిన దిల్ రాజు అది పవన్ తోనే చేయాలని కథల వేట మొదలుపెట్టాడట. మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి!

Read: 15 Years Pokiri: ఎవడు కొడితే మైండ్ బ్లాకవుతుందో.. ఆ పండుగాడికి 15 ఏళ్ళు!