Peddanna: భారీ డిజాస్టర్ దిశగా పెద్దన్న.. రజనీ సార్ ఎందుకిలా?

సూపర్ స్టార్ రజనీ కాంత్ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అడుగేస్తే ఇండస్ట్రీ రికార్డులు, స్టెప్పేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైన రోజులెన్నో కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.

Peddanna: భారీ డిజాస్టర్ దిశగా పెద్దన్న.. రజనీ సార్ ఎందుకిలా?

Peddanna

Peddanna: సూపర్ స్టార్ రజనీ కాంత్ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అడుగేస్తే ఇండస్ట్రీ రికార్డులు, స్టెప్పేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైన రోజులెన్నో కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కంటి చూపుతో ఇండియన్ సినిమాని శాసించిన రోజులూ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. అయితే.. కొన్నాళ్లగా రజనీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఆయనకి ఆయన వయసు మీదపడినా కెమెరా ముందు జోరు మాత్రం తగ్గలేదని ప్రతి సినిమాలో కనిపిస్తుంది.

Peddanna: ఫ్యామిలీ మ్యాన్‌గా తలైవా.. ఫలితం ఎలా ఉంటుందో?

రజనీలో ఏ మాత్రం జోష్ తగ్గలేదని ఆయన నటన, డాన్స్, ఫైట్స్ చూస్తే అర్ధమవుతుంది. కానీ.. కథలో లోపాలు మాత్రం ఆయన సినిమాలకి శాపాలుగా మారుతున్నాయి. రోబో సినిమా తర్వాత మళ్ళీ ఆ స్థాయి సినిమా రజనీ ఖాతాలో లేదు. రోబో సీక్వెల్ వచ్చినా అది శంకర్ బ్రాండ్, రోబో ఫలితం కలిసి ఆ సినిమాను సక్సెస్ బాట పట్టించినా పదేళ్లలో మిగతా ఏ సినిమా కూడా ఇది రజనీ స్థాయి సినిమా అనిపించుకోలేదు. ఇప్పుడు అన్నాత్తై కూడా అదే పరిస్థితి. ఈ సినిమా కథ విషయంలో విశ్లేషకులు తీవ్రంగా తూర్పారపట్టారు.

Peddanna : బతికుంటే బాలునే పాడేవారు..

అన్నాత్తై తమిళనాడులో భారీ ఓపెనింగ్స్ రాబట్టినా మెల్లగా అక్కడా తగ్గుతూ వచ్చింది. ఇక తెలుగులో అయితే ఈ సినిమా రజనీ కెరీర్ లోనే డిజాస్టర్ గా నమోదైంది. ఒక్క నైజాంలోనే మూడో రోజు కేవలం 6.31 లక్షలు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు నైజాంలో మొత్తం 34.97 లక్షలు గ్రాస్ మాత్రమే రాబట్టిందంటే ఇది ఎంతటి డిజాస్టర్ గా మిగిలిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా రివ్యూలలో కూడా రజనీకి ఎక్కడా మైనస్ మార్క్స్ పెట్టలేదు. కథే ఓ యాభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు రజనీ సినిమాలు ఎందుకిలా బోల్తా కొడుతున్నాయో!