Dogs Wedding: పెంపుడు కుక్కల పెళ్లి అదుర్స్.. భారీగా తరలివచ్చిన అతిథులు.. ఎక్కడంటే..

పెళ్లి అంటే.. అదో అద్భుత ఘట్టం. బంధుమిత్రులు, తెలిసినవారందరిని పిలుచుకొని వివాహాన్ని ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీ. పెళ్లికి వచ్చిన అతిథులకు అదిరిపోయే రుచులతో వంటకాలు సిద్ధం చేస్తాం. అచ్చం ఇలానే కుక్కల పెళ్లికూడా జరిగింది.

Dogs Wedding: పెంపుడు కుక్కల పెళ్లి అదుర్స్.. భారీగా తరలివచ్చిన అతిథులు.. ఎక్కడంటే..

Dogs Widding

Dogs Wedding: పెళ్లి అంటే.. అదో అద్భుత ఘట్టం. బంధుమిత్రులు, తెలిసినవారందరిని పిలుచుకొని వివాహాన్ని ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీ. పెళ్లికి వచ్చిన అతిథులకు అదిరిపోయే రుచులతో వంటకాలు సిద్ధం చేస్తాం. అచ్చం ఇలానే కుక్కల పెళ్లికూడా జరిగింది. భారీగా తరలివచ్చిన అతిథుల మధ్య హిందూ సాంప్రదాయ పద్దతిలో తమ పెంపుడు కుక్కల పెళ్లి జరిపించారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఈ వివాహాన్ని చూసిన ప్రతిఒక్కరూ మనుషులకు కూడా ఇలా జరగదే అంటూ ముక్కున వేలేసుకున్నారు.

Dogs Widding (2)

Dogs: కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని భరువా సుమెర్‌పూర్ గ్రామంలో ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది. ఒక మగ కుక్క, ఒక ఆడ కుక్క పరస్పరం వివాహం చేసుకున్నాయి. సౌంఖర్ అడవుల్లో మనసర్ బాబా శివ మందిరానికి చెందిన పూజారి ద్వారకా దాస్ మహరాజ్ తన పెంపుడు కుక్కకు వివాహం చేయాలని భావించాడు. పరఛాచ్ లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్ పెంచుకునే ఆడ కుక్కతో వివాహం నిశ్చయించారు. జూన్ 5న ముహూర్తం పెట్టి శిష్యులు, స్థానిక ప్రజల శుభలేఖలు అందించారు. వారి సమక్షంలో హిందూ వివాహ సాంప్రదాయాల ప్రకారం పెంపుడు కుక్కలకు వివాహం జరిపించారు.

Dogs Widding (1)

Dogs Birthday: పెంపుడు కుక్క పుట్టినరోజున 150 మందికి బిర్యానీ దానం చేసిన దినసరి కూలీ

మానసర్ బాబా శివాలయం నుండి సౌంఖర్ గ్రామ వీధుల్లో భారీ పెళ్లి ఊరేగింపుగా మౌదాహా ప్రాంతంలోని పర్చా గ్రామానికి చేరుకున్నారు. రెండు కుక్కలకు కొత్త బట్టలు ధరించి, బంగారం, వెండి ఆభరణాలను అలంకరించారు. ఈ ఊరేగింపులో భారీ సంఖ్యలో (సుమారు 500మందికి పైగా) ద్వారకా దాస్ మహారాజ్, అర్జున్ దాస్ మహారాజ్ శిష్యులు పాల్గొన్నారు. రెండు పెంపుడు కుక్కలకు వివాహం పూర్తయ్యాక వింధును ఏర్పాటు చేశారు. ఈ విందులో సుమారు పది రకాలకుపైగా వంటకాలను అతిథులకు వడ్డించారు. ధనికుల ఇళ్లలో జరిగే పెళ్లిని తలపించేలా పెంపుడు కుక్కల పెళ్లిని జరిపించడంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. కాగా పలువురు అతిథులు కుక్కలకు 11 వేల రూపాయల నగదు చదివింపులు కింద అందజేశారు.