Delhi air pollution : ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటీషన్ .. పంజాబ్,హర్యానా,యూపీ, ఢిల్లీ సీఎస్ లకు నోటీసులు

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఈ పిటిషన్ పై ఈనెల 10వ తేదీన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై NHRC స్పందించింది.పంజాబ్,హర్యానా,యూపీ, ఢిల్లీ సీఎస్ లకు నోటీసులు జారీ చేసింది.

Delhi air pollution :  ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటీషన్ .. పంజాబ్,హర్యానా,యూపీ, ఢిల్లీ సీఎస్ లకు నోటీసులు

Petition in Supreme Court on Delhi air pollution..

Delhi air pollution : ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఈ పిటిషన్ పై ఈనెల 10వ తేదీన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై NHRC స్పందించింది.పంజాబ్,హర్యానా,యూపీ, ఢిల్లీ సీఎస్ లకు నోటీసులు జారీ చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది.పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానాతో పాటు యూపీ రైతులు పంట వ్యర్థాలను కాలుస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తుంది.దీని కారణంగా గాలి నాణ్యత అత్యంత కనిష్టానికి పడిపోయింది.దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం రేపటినుంచి స్కూళ్లు మూసివేయాలని ఆదేశించింది. ప్రైమరీ స్కూల్స్ మూసి వేయాలని ఆదేశించింది.

కాగా ఢిల్లీలో వాయుకాలుష్యం గురించి సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలుకావటం వాటిపై ధర్మాసనం తీవ్ర విచారణ చేయటం కొనసాగుతునే ఉంది. కానీ ఫలితాలు మాత్రం శూన్యం..కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితాలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు. శీతాకాలం వచ్చిదంటే చాలు ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది. దీంతో నగరవాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. కాలుష్య నియంత్రణకు ముఖ్యకారణం ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగులబెట్టటమే. వీటి కోసం చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తునే ఉంది. కానీ ఫలితాలు మాత్రం శూన్యం..

ఢిల్లీలోని వాయు కాలుష్యంపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఘాటు వ్యాఖ‌్యలు చేశారు. ప్రజలు బలవంతంగా ఇళ్లలో కూడా మాస్క్‌లు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని దీని తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించుకోవాలని ఢిల్లీలోని వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటీషన్‌ను విచారిస్తున్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిన చీఫ్‌ జస్టిస్‌ వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారని సొలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించారు. అదేవిధంగా పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు పంట వ్యర్థాలు తగులబెట్టకుండా ఏం చర్యలు తీసుకున్నారని సుప్రీం ప్రశ్నించింది. అయినా ఈ ఏడాది కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలోనే ఉన్న పరిస్థితి.