Petrol Diesel Price Today : రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూన్ 15) లీటర్ పెట్రోల్ ధర రూ.97గా ఉంది.

Petrol Diesel Price Today : రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Prices Remain At Record High Levels As Fuel Rates Unchanged Today

Updated On : June 15, 2021 / 10:13 AM IST

Petrol Diesel Price Today : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూన్ 15) లీటర్ పెట్రోల్ ధర రూ.97గా ఉంది. హైదరాబాద్‌ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కు దాటేసింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు.రికార్డు స్థాయిలో ఇందన ధరలు ఉన్నాయి, ఇంధన ధరలను సోమవారం మళ్లీ 29 నుంచి 31 పైసలు పెంచిన సంగతి తెలిసిందే.

ఆరు వారాల్లో ఇది 24వసారి. అధికారిక సమాచారం ప్రకారం.. మంగళవారం రోజున దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.4 ఉండగా.. డీజిల్ ధర రూ.87.28లుగా ఉంది.

ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.58గా ఉండగా.. డీజిల్ లీటర్ ధర రూ.94.70గా ఉంది. కోల్క తాలో పెట్రోల్ ధర రూ.96.34 ఉండగా.. డీజిల్ ధర రూ.90.12గా ఉంది. చెన్నైలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.97.69గా ఉండగా.. డీజిల్ లీటర్ ధర రూ.91.92గా
ఉంది.