Pinaka-ER : పినాక-ఈఆర్ రాకెట్ లాంచర్ ప్రయోగం విజయవంతం

భారత సైన్యం దశాబ్ద కాలంగా వినియోగిస్తున్న పినాక రాకెట్‌ లాంచర్‌ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) శనివారం రాజస్తాన్‌లోని పోఖ్రాన్

Pinaka-ER : పినాక-ఈఆర్ రాకెట్ లాంచర్ ప్రయోగం విజయవంతం

Pinaka

Pinaka-ER భారత సైన్యం దశాబ్ద కాలంగా వినియోగిస్తున్న పినాక రాకెట్‌ లాంచర్‌ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) శనివారం రాజస్తాన్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో…పినాకా రాకెట్ వ్య‌వ‌స్థ‌కు చెందిన ఎక్స్‌టెండెడ్ రేంజ్‌(పినాక-ఈఆర్)మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. పినాక-ఈఆర్ అనేది గత దశాబ్ద కాలంగా భారత సైన్యంతో సేవలో ఉన్న పినాకా మునుపటి వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ అని డీఆర్‎డీవో తెలిపింది.

పినాక-ఈఆర్​ రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థ సాంకేతికతను డీఆర్​డీఓకు చెందిన ఆయుధ పరిశోధన, అభివృద్ధి సంస్థ(ARDE), పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ (HEMRL)తో కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. డీఆర్​డీఓ నుంచి ఈ సాంకేతికతను పొందిన ఓ ప్రైవేటు కంపెనీ.. రాకెట్‌ వ్యవస్థను అభివృద్ధి చేసింది. కొత్తగా ఉద్భవిస్తున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించినట్లు డీఆర్​డీఓ తెలిపింది. భాగస్వామ్య ప్రైవేటు కంపెనీ.. సాంకేతికతను అవగతం చేసుకోవడంలో ప్రాథమికంగా విజయవంతం కావడం.. పినాక-ఈఆర్​ రాకెట్‌ వ్యవస్థ తయారీకి ఆ కంపెనీని సిద్ధం చేసినట్లు వెల్లడించింది.

ఇక, గత మూడు రోజులుగా పోఖ్రాన్​లో చేపట్టిన పినాక రాకెట్​ లాంచర్​ విస్తరణ శ్రేణి వ్యవస్థ వివిధ దశ ప్రయోగాలు విజయవంతమైనట్లు రక్షణశాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రయోగాల్లో భాగంగా గత మూడు రోజులుగా వివిధ శ్రేణులు, వార్‌హెడ్‌ల సామర్థ్యాలతో 24 పినాకా రాకెట్లను ప్రయోగించినట్లు,వివిధ ర‌కాల సామ‌ర్ధ్యం ఉన్న‌ వార్‌హెడ్స్ తో పినాకా రాకెట్ల‌ను ప‌రీక్షించామ‌ని, అన్ని ట్ర‌య‌ల్స్‌లోనూ సంతృప్తిక‌రంగా ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

కాగా,పినాకా ఎంకే-ఐ రాకెట్ వ్య‌వ‌స్థ సుమారు 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్నలక్ష్యాలను నాశనం చేయగలదు. అలాగే పినాకా-2 వేరియంట్ 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చిత్తు చేస్తుంది. ఇక పినాకా-ఈఆర్ రేంజ్‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. అయితే వివిధ రేంజ్‌ల్లో ఉన్న టార్గెట్ల‌పై 24 రాకెట్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు మాత్రమే తెలిపారు.

ALSO READ Final Goodbye : రావత్ దంపతుల చితాభ‌స్మాన్ని గంగాన‌దిలో కలిపిన కుమార్తెలు