presidential election 2022: ఓటు వేసిన మోదీ, ఇతర ప్రముఖులు
రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఓటు వేశారు. రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఓటు వేసేముందు మోదీ మీడియాతో మాట్లాడారు.

Modi3
presidential election 2022: రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఓటు వేశారు. రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఓటు వేసేముందు మోదీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ పార్లమెంటు సమావేశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని చెప్పారు. ఇదే సమయంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నామని తెలిపారు.
England vs India: రిషబ్ పంత్ అద్భుత ఆటతీరుపై సచిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్రశంసల జల్లు
త్వరలో పంద్రాగస్టు రానుందని గుర్తుచేశారు. 25 ఏళ్ళలో దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందని చెప్పారు. మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, దేశాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళడానికి తీర్మానాలు చేసుకోవాల్సిన సమయం ఇదని ఆయన అన్నారు. కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఓట్లు వేయడానికి క్యూ కట్టారు. జూలై 21 న పార్లమెంట్ లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు ప్రకటిస్తారు. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.