Morning Consult : ఆరాధించే నేతల్లో మోదీ టాప్ ప్లేస్
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించే నేతల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ ముందున్నారు. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

Modi
PM Modi : ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించే నేతల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ ముందున్నారు. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 70 శాతం మంది ఆమోదంతో మిగతా దేశాల నేతలతో పోల్చితే మోదీ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని.. కేంద్రమంత్రి పియూష్ గోయాల్ ‘కూ’ యాప్‌లో వెల్లడించారు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడా ప్రధాని ట్రూడో, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో తదితరులు ఉన్నారు.
Read More : Pentagon : అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా భారీ గ్రామం నిర్మించిందా ?
మోదీ 70 శాతం ఆమోదంతో మరోసారి గ్లోబల్ లీడర్‌లలో అగ్రస్థానంలో నిలిచారని పియూష్ గోయల్ పేర్కొన్నారు. 13 మంది ప్రపంచ నేతల కంటే ముందుగా ఉన్నారని సర్వే ద్వారా తేలింది. ఇటాలియన్ ప్రధాని మారియో డ్రాగి, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల కంటే మోదీ ముందున్నట్లు సర్వేలో తేలింది.
Read More : Puneeth Rajkumar : పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకునేందుకు వచ్చిన ప్రేమ జంట.. అడ్డుకున్న పోలీసులు
ప్రతి దేశంలోని కొంతమంది ఇంటర్వ్యూల ఆధారంగా మార్నింగ్ కన్సల్ట్ ఈ జాబితాను తయారు చేస్తుంది. మార్నింగ్ కన్సల్ట్ ఇండియాలో 2 వేల 126 మందిని ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసింది. అమెరికన్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ పలు దేశాలలోని అగ్ర నాయకులకు రేటింగ్ ఇచ్చింది.