PM Narendra Modi: నేడు కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.. ముంబైలో రోడ్ షో..

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటక, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటకలోని యాద్గిర్, కలబురగి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. ఈ ప్రాంతాల్లో రూ. 10,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా మహారాష్ట్రలోని ముంబైలో పర్యటించనున్న మోదీ.. దాదాపు రూ. 38వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

PM Narendra Modi: నేడు కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.. ముంబైలో రోడ్ షో..

PM Modi Road Show

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటక, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటకలోని యాద్గిర్, కలబురగి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. ఈ ప్రాంతాల్లో రూ. 10,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా మహారాష్ట్రలోని ముంబైలో పర్యటించనున్న మోదీ.. దాదాపు రూ. 38వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధాని పర్యటన ఆసక్తికరంగా మారింది.

PM Modi : దేశానికి అత్యుత్తమ కాలం రాబోతోంది..యువతపై ఫోకస్ పెట్టండీ : ప్రధాని మోడీ

మధ్యాహ్నం 12గంటలకు యాద్గిర్ జిల్లా కోడెకర్ వద్ద సాగునీరు, తాగునీరు జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం 2.15 గంటలకు కుల్బర్గి జిల్లాలోని మల్ఖేడ్ కు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కర్ణాటకలోని ముంబైలో పర్యటిస్తారు. ఇక్కడ దాదాపు రూ. 12,600 కోట్లతో ముంబై మెట్రో‌రైల్‌ 2ఎ, 7 లైన్లను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. మెట్రో‌లైన్ 2ఏ సుమారు 18.6 కి.మీ పొడవు ఉంటుంది. మెట్రో లైన్ 7 సుమారు 16.5 కి.మీ పొడవు ఉంటుంది. ఈ రెండు లైన్లకు ప్రధాని మోదీ 2015లో శంకుస్థాపనలు చేశారు.

PM Modi : దేశానికి అత్యుత్తమ కాలం రాబోతోంది..యువతపై ఫోకస్ పెట్టండీ : ప్రధాని మోడీ

అదేవిధంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ఎంఎం‌ఆర్డీఎ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో ఏడు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, రోడ్ కాంక్రీట్ ప్రాజెక్ట్, ఛత్రపతి శివాజి మహారాజ్ టెర్మినల్ పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. ముంబైలో రోడ్ షోలోనూ ప్రధాని పాల్గొంటారని సమాచారం. అయితే, ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రధాని మోదీ ముంబైకి వెళ్లడం ఇదే తొలిసారి.