Poco M4 5G Sale : ఇండియాలో ఫస్ట్ టైం సేల్.. ఈ 5G ఫోన్‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఎంతంటే?

Poco M4 5G Sale : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Poco నుంచి M4 5G స్మార్ట్ ఫోన్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో Poco M4 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ టైం సేల్ ప్రారంభమైంది.

Poco M4 5G Sale : ఇండియాలో ఫస్ట్ టైం సేల్.. ఈ 5G ఫోన్‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఎంతంటే?

Poco M4 5g Goes On Sale For The First Time In India Is It Worth Rs 12,999

Poco M4 5G Sale : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Poco నుంచి M4 5G స్మార్ట్ ఫోన్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో Poco M4 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ టైం సేల్ ప్రారంభమైంది. పోకో అందించే అన్ని ప్రొడక్టుల మాదిరిగానే ఈ స్మార్ట్‌ఫోన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో అందుబాటులోకి వచ్చింది. మే 5 మధ్యాహ్నం నుంచి Poco M4 5G సేల్ మొదలైంది. పోకో ఎల్లో, కూల్ బ్లూ పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. Poco M4 5G రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. ఈ రెండూ వేరియంట్లు ఫ్లిప్ కార్ట్ సేల్లో అందుబాటులో ఉండనున్నాయి.

Poco M4 5G బేస్ మోడల్ 4GB RAM, 64GB స్టోరేజ్‌తో రూ. 12,999 ధరతో వస్తుంది. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 14,999లకు అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. Poco రూ. 2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అది కూడా SBI కార్డుపైన ఆఫర్ చేస్తుంది. SBI క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేసే కొనుగోలుదారులు రూ. 2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. Poco M4 5G స్మార్ట్ ఫోన్ రూ. 10,999 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. డిస్కౌంట్ ద్వారా టాప్-ఎండ్ Poco M4 5G మోడల్ ఫోన్ రూ.12,999కి అందుబాటులో ఉంటుంది.

Poco M4 5g Goes On Sale For The First Time In India Is It Worth Rs 12,999 (1)

Poco M4 5g Goes On Sale For The First Time In India Is It Worth Rs 12,999

Poco M4 5G ఫీచర్లు ఇవే :
Poco M4 5G చాలా పవర్ ఫుల్ ఫోన్ మాదిరిగా కనిపిస్తుంది. 6.58-అంగుళాల FULL HD+ LCD డిస్ప్లేతో 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్ పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌‌తో వస్తుంది. 6GB వరకు LPDDR4X RAM, 128GB వరకు UFS2.2 స్టోరేజీతో ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులోని సాఫ్ట్‌వేర్ MIUI 13తో Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

ఫ్రంట్ సైడ్ కెమెరాలో ఫోన్ 50-MP ప్రైమరీ షూటర్, 2-MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ సెటప్‌తో వచ్చింది. సెల్ఫీల కోసం 8-MP సెన్సార్‌ను అందిస్తుంది. ఫోన్ బాక్స్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ వచ్చింది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, హెడ్‌ఫోన్ జాక్, డెడికేటెడ్ మైక్రో-SD కార్డ్ స్లాట్, 5G, డ్యూయల్-సిమ్, బ్లూటూత్ 5.1, GPS మరిన్ని కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. Poco M4 5G ధర విభాగంలో మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.

Read Also :  Poco X4 Pro 5G : పోకో నుంచి మిడ్‌ రేంజ్ 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?