Delhi: మా పోస్ట‌ర్లు తొల‌గించి మోదీ పోస్ట‌ర్లను అంటించారు: ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్‌

ఢిల్లీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ కార్య‌క్ర‌మంలో పోలీసులు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ పోస్ట‌ర్లను అంటించారని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. అసోలా వన్యప్రాణుల అభయారణ్యం వ‌ద్ద తాము చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని ఆయ‌న చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాల‌యం ఢిల్లీ పోలీసుల‌ను త‌మ కార్య‌క్ర‌మం వ‌ద్ద‌కు పంపిందని ఆయ‌న ఆరోపించారు. వ‌న‌మ‌హోత్స‌వ్ పేరిట తాము ఏర్పాటు చేసిన బ్యాన‌ర్ల‌ను తీసేసి, పోలీసులు మోదీ బ్యానర్లు పెట్టార‌ని చెప్పారు.

Delhi: మా పోస్ట‌ర్లు తొల‌గించి మోదీ పోస్ట‌ర్లను అంటించారు: ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్‌

Banner

Delhi: ఢిల్లీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ కార్య‌క్ర‌మంలో పోలీసులు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ పోస్ట‌ర్లను అంటించారని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. అసోలా వన్యప్రాణుల అభయారణ్యం వ‌ద్ద తాము చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని ఆయ‌న చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాల‌యం ఢిల్లీ పోలీసుల‌ను త‌మ కార్య‌క్ర‌మం వ‌ద్ద‌కు పంపిందని ఆయ‌న ఆరోపించారు. వ‌న‌మ‌హోత్స‌వ్ పేరిట తాము ఏర్పాటు చేసిన బ్యాన‌ర్ల‌ను తీసేసి, పోలీసులు మోదీ బ్యానర్లు పెట్టార‌ని చెప్పారు.

ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్‌లోనూ పోస్ట్ చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ రావాల్సి ఉంద‌ని, అయితే, పోలీసులు పీఎంవో ఆదేశాల‌తో చేసిన ఈ ప‌నికి సీఎం హాజ‌రుకావట్లేద‌ని ప్ర‌క‌టించారు. మోదీ పోస్ట‌ర్ల‌ను ఎవ‌రైనా ముట్టుకుంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని ఢిల్లీ పోలీసులు హెచ్చ‌రించార‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా కూడా హాజ‌రుకావాల్సి ఉంద‌ని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక పోలీసులు ప్ర‌ద‌ర్శించిన తీరు స‌రికాద‌ని ఆయ‌న చెప్పారు. ఈ కార్యక్రమానికి తాను కూడా వెళ్ళబోనని తెలిపారు.