Tunisha Sharma : తునీషాది హత్య అంటున్న పోలీసులు!
బాలీవుడ్ సినీ మరియు టీవీ నటి 'తునీషా శర్మ' ఆత్మహత్యతో హిందీ పరిశ్రమ మరోసారి ఉలిక్కిపడింది. ముంబైలో నిన్న సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న తునీషా షూటింగ్ సెట్‌లోని మేకప్ రూమ్‌లో ఉరువేసుకోవడం అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముందుగా ఈ కేసుని ఆత్మహత్యగా పరిగణించిన పోలీసులు..

Police say that Tunisha Sharma was murdered
Tunisha Sharma : బాలీవుడ్ సినీ మరియు టీవీ నటి ‘తునీషా శర్మ’ ఆత్మహత్యతో హిందీ పరిశ్రమ మరోసారి ఉలిక్కిపడింది. 20 ఏళ్ళ వయసు తునీషా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. అందం అభినయం కలిసి ఉన్న ఆమె వెండితెరపై, బుల్లితెరపై మంచి ఆఫర్లే అందుకుంటుంది. ప్రొఫెషనల్ కెరీర్ బాగానే ఉన్న సమయంలో తునీషా ఆత్మహత్య తోటి నటీనటలను దిగ్బ్రాంతికి లోనయ్యేలా చేసింది.
Tunisha Sharma Last Video : ఆత్మహత్యకు ముందు.. యువ నటి వీడియో వైరల్, ఈ షాట్ తర్వాతే సూసైడ్..!
ముంబైలో నిన్న సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న తునీషా షూటింగ్ సెట్‌లోని మేకప్ రూమ్‌లో ఉరువేసుకోవడం అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అప్పటి వరకు షూటింగ్‌లో సరదాగా ఉన్న నటి, సడన్‌గా ఉరితాడుకి వేలాడుతూ కనపించడంపై అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ కేసుని ఆత్మహత్యగా పరిగణించిన పోలీసులు.. సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో, దీని హత్యకోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే నిన్న షూటింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కర్ని విచారించడం మొదలుపెట్టారు పోలీసులు. కాగా సూసైడ్ కి ముందు తునీషా శర్మ.. ఆత్మహత్య సీన్ లో నటించడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది వైరల్ గా మారింది. ఇక ఈమె మరణ వార్త విన్న అభిమానులు, సహనటులు, సినీప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఎంతో భవిషత్తు ఉన్న తునీషా శర్మ ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరం.