Ambulance : అంబులెన్స్‌కి దారివ్వని పోలీసులు.. హోంమంత్రి సీరియస్

ప్రోటోకాల్ పేరుతో హైదరాబాద్ మాసబ్ ట్యాంకులో పోలీసులు ప్రాణాపాయ స్థితిలో రోగిని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, అంబులెన్స్ కు దారివ్వాలని అంబులెన్స్ సిబ్బంది బతిమిలాడినా పోలీసులు మాత్రం నో చెప్పారు.

Ambulance : అంబులెన్స్‌కి దారివ్వని పోలీసులు.. హోంమంత్రి సీరియస్

Ambulance

Ambulance : ప్రోటో కాల్ పేరుతో హైదరాబాద్ మాసబ్ ట్యాంకులో పోలీసులు.. ప్రాణాపాయ స్థితిలో రోగిని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, అంబులెన్స్ కు దారివ్వాలని అంబులెన్స్ సిబ్బంది బతిమిలాడినా పోలీసులు మాత్రం నో చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  అత్యుత్సాహం చూపారని జనాలు మండిపడుతున్నారు. పోలీసుల తీరుపై హోంమంత్రి మహమూద్ అలీ సీరియస్ అయ్యారు. అంబులెన్స్ ఘటనపై హైదరాబాద్ సీపీకి ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ ఘటనపై సీపీ అంజనీ కుమార్ హోంమంత్రికి వివరణ ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

మాసబ్ ట్యాంక్ దగ్గర ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. అదే సమయంలో హోంమంత్రి అటువైపుగా వస్తున్నారని ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ను ఆపేశారు. దీంతో రోగిని తరలిస్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుంది. సమయానికి రోగికి చికిత్స అందించక పొతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని భావించిన అంబులెన్స్ లోని వైద్య సిబ్బంది.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర విధులను నిర్వహిస్తున్న సిబ్బందిని దారి ఇవ్వమని బతిమిలాడారు.

అయినప్పటికీ ట్రాఫిక్ సిబ్బంది మనసు కరగలేదు. దారి ఇచ్చేందుకు నో చెప్పారు. తమకు ప్రోటో కాల్, విధి నిర్వహణే ముఖ్యం అంటూ ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంతేకాదు అంబులెన్స్ సైరన్ కూడా ఆపించారు. ప్రోటోకాల్ పేరుతో అంబులెన్స్ ను అడ్డుకున్న పోలీసుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాల కన్నా పోలీసులకు ప్రోటోకాల్ ముఖ్యమా అని జనాలు మండిపడుతున్నారు. ప్రభుత్వమైనా, అధికారులైనా ప్రజల కోసం పనిచేయాలని అంటున్నారు.