Faridabad: లంచం తీసుకున్న డబ్బు మింగేందుకు ప్రయత్నించిన ఎస్ఐ.. అడ్డుకున్న అధికారులు.. వీడియోలో రికార్డ్

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడో ఎస్ఐ. అయితే, అధికారులు పట్టుకున్న కరెన్సీ నోట్లను మింగేందుకు ప్రయత్నించాడు ఆ ఎస్ఐ. ఈ ఘటన వీడియోలో రికార్డైంది.

Faridabad: లంచం తీసుకున్న డబ్బు మింగేందుకు ప్రయత్నించిన ఎస్ఐ.. అడ్డుకున్న అధికారులు.. వీడియోలో రికార్డ్

Faridabad: ఒక కేసుకు సంబంధించి లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన ఎస్ఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అయితే, ఆధారాలు లేకుండా లంచం సొమ్మును మింగేందుకు ప్రయత్నించాడు ఆ ఎస్ఐ. ఈ ఘటన వీడియోలో రికార్డైంది. హరియాణా, ఫరిదాబాద్ ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్లో మహేంద్ర ఉలా ఎస్ఐగా పని చేస్తున్నాడు.

Uttar Pradesh: ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీ… ఆరుగురు మృతి.. 21 మందికి గాయాలు

తన పోలీస్ స్టేషన్లో ఒక ఎద్దు దొంగతనానికి సంబంధించిన కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం శంభునాథ్ అనే వ్యక్తి దగ్గరి నుంచి రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు మహేంద్ర. దీంతో శంభునాథ్ రూ.6000 చెల్లించాడు. మిగతా డబ్బు చెల్లించే విషయంలో బాధితుడు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వాళ్లు నిఘా వేసి, పక్కా ప్లాన్‌తో లంచం తీసుకుంటున్న ఎస్ఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలి అనుకున్నారు. ఈ క్రమంలో శంభు నాథ్ దగ్గరి నుంచి ఎస్ఐ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అయితే, కేసులో అతడు చేసిన నేరాన్ని రుజువు చేయాలంటే పట్టుకున్న సొమ్ము ఉండటం చాలా అవసరం. అధికారులు స్వాధీనం చేసుకున్న కరెన్సీ నోట్లు, వాటిపై అతడి వేలి ముద్రలు లేకపోతే కేసు నిలబడే అవకాశాలు తక్కువ.

Lionel Messi: ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పనున్న మెస్సీ… ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో వీడ్కోలు చెప్పనున్న అర్జెంటినా దిగ్గజం

ఇది గుర్తించిన మహేంద్ర అధికారులు పట్టుకున్న కరెన్సీ నోట్లను బలవంతంగా మింగేందుకు ప్రయత్నించాడు. అయితే, అధికారులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పైగా ఈ ఘటనను అక్కడి అధికారులు వీడియో కూడా తీశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులు ఎస్ఐపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.