Sec-Bad : ఇక ఇంటి వద్దకే గణపతి ప్రసాదం, నవరాత్రి ఉత్సవాల వేళ ప్రత్యేక ఏర్పాట్లు

వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే పలు ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే..కరోనా నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Sec-Bad : ఇక ఇంటి వద్దకే గణపతి ప్రసాదం, నవరాత్రి ఉత్సవాల వేళ ప్రత్యేక ఏర్పాట్లు

Ganapathi

Updated On : August 26, 2021 / 10:24 AM IST

Ganapati Navarathrulu : వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే పలు ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే..కరోనా నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు కూడా ఆలయాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో భక్తులకు పలు సేవలను అందచేయాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు.

Read More : AP : సముద్రంలో ఏం జరుగుతోంది ? ముందుకు, వెనక్కు..భయాందోళనలో స్థానికులు

ఈ విషయంలో ప్రముఖ ఆలయంగా పేరొందిన సికింద్రాబాద్ గణపతి ఆలయంలో ఆన్ లైన్ సేవలు, ఇంటివద్దకే ప్రసాద పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు దేవాదాయ, తపాలా శాఖలు సంయుక్తంగా ఈ ఏర్పాట్లు చేయనున్నాయి. ప్రయోగాత్మకంగా ఇక్కడ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. తపాలా శాఖ ఈ – షాప్ వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే..నిర్ధారిత రోజుల్లో వారి పేరిట నవరాత్రి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.

Read More : Suicide : అప్పులబాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

అంతేగాకుండా..కుంకుమ, అక్షింతలు, పొడి ప్రసాదాలను స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్ల వద్దకే పంపుతారు. సెప్టెంబర్ 12 లక్ష బిల్వార్చన రూ. 320. 14వ తేదీన సత్య గణపతి వ్రతాలు రూ. 620. 17వ తేదీన సిద్ధిబుద్ధి సమేత గణపతి కళ్యాణం రూ. 620. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సహస్ర మోదక గణపతి హోమాలు రూ. 620. 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సర్పదోష నివారణ అభిషేకాలు రూ. 400. ఉంటాయని అధికారులు తెలిపారు. కనీసం రెండు రోజుల ముందు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.