Adipurush : ఆదిపురుష్ రన్ టైం ఎంతో తెలుసా.. జై శ్రీరామ్ సాంగ్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్!
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫైనల్ రన్ టైం ఫిక్స్ చేసుకుంది. మరి సెన్సార్ ఏమన్నా కత్తెరలు వేస్తారా? లేదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా? చూడాలి.

Prabhas Adipurush locked final run time and jai shriram song release
Prabhas Adipurush : ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా కనిపిస్తూ చేస్తున్న మైథిలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. టీసిరీస్, రెట్రోఫైల్స్ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచేసింది. జూన్ 16న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.
Bichagadu 2 Twitter Review : బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ.. దీనికంటే కంటే బిచ్చగాడు బెటర్??
ఇక మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆదిపురుష్ ఫైనల్ అవుట్ పుట్ ని రెడీ చేశారట. ఈ మూవీ టోటల్ రన్ టైం.. 2 గంటల 54 నిముషాలు వచ్చిందట. త్వరలోనే సెన్సార్ కి కూడా వెళ్లనుంది. మరి సెన్సార్ ఏమన్నా కత్తెరలు వేస్తారా? లేదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా? చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీలోని జై శ్రీరామ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ శనివారం (మే 20) జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Prabhas : ఆదిపురుష్ హిట్ అవ్వాలని.. భద్రాద్రి రాముడికి 10 లక్షల విరాళం ఇచ్చిన ప్రభాస్..
కాగా ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే కనిపించబోతున్నారు. తెలుగులో ఈ సినిమాని ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయబోతుంది. ఇది ఇలా ఉంటే.. ఈ మూవీ రిలీజ్ కి ముందే ట్రిబెకా ఫెస్టివల్ (Tribeca Film Festival) లో ప్రీమియర్ కానుంది. జూన్ 7 నుంచి 18 వరకు జరగబోయే ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఆదిపురుష్ ని జూన్ 15న తేదీ ప్రదర్శించనున్నారు. ఆ తరువాత రోజు జూన్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.