Prabhas : హీరోయిన్స్ అంతా బాలయ్యనే పొగుడుతారు..

బాలకృష్ణ గురించి కూడా ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ప్రభాస్ మాట్లాడుతూ.. మీరు సినిమాల్లో చాలా సీరియస్ గా కనిపించినా బయట మాత్రం చాలా సరదాగా ఉంటారని, చిన్నపిల్లాడిలా ఉంటారని అందరూ చెప్తారు. మీరు శృతి హాసన్ తో.............

Prabhas : హీరోయిన్స్ అంతా బాలయ్యనే పొగుడుతారు..

Prabhas about balakrishna

Prabhas :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరు ఎపిసోడ్స్ ఇప్పటికే పూర్తికాగా ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ ని తీసుకొచ్చారు. ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడు అని తెలియడంతో ముందునుంచి ఈ ఎపిసోడ్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి ఫ్యాన్స్ కి మరింత జోష్ ఇచ్చింది ఆహా టీం.

ప్రభాస్ అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుందని చెప్పినా డిసెంబర్ 29 రాత్రే రిలీజ్ చేసి అభిమానులకి ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇచ్చింది ఆహా. ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ఆహా సర్వర్లు ఎక్కువ ఫ్లోటింగ్ తో క్రాష్ అయ్యాయి అంటే ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Unstoppable : ఎవ్వరికి ఇవ్వని ఆఫర్ ప్రభాస్ కి ఇచ్చిన బాలయ్య..

ఇక ఎపిసోడ్ లో ప్రభాస్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ప్రభాస్ నటుడిగా మారి 20 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులతో స్పెషల్ షూట్ చేసి ప్రోమో కూడా వేశారు. ప్రభాస్ సినిమాలు, పెళ్లి.. ఇలా అనేక టాపిక్స్ ప్రస్తావించాడు బాలయ్య. బాలకృష్ణ గురించి కూడా ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ప్రభాస్ మాట్లాడుతూ.. మీరు సినిమాల్లో చాలా సీరియస్ గా కనిపించినా బయట మాత్రం చాలా సరదాగా ఉంటారని, చిన్నపిల్లాడిలా ఉంటారని అందరూ చెప్తారు. మీరు శృతి హాసన్ తో వీరసింహా రెడ్డి చేశారుగా సలార్ సెట్ కి వచ్చి మీ గురించి శృతి హాసన్ గంట సేపు పొగిడింది. బాలయ్య సూపర్, చాలా బాగా మాట్లాడతారు, చాలా సరదాగా ఉంటారు అని పొగుడుతూనే ఉంది. ఇప్పుడే కాదు చక్రం సినిమా టైంలో కూడా ఆసిన్ మీ గురించి బాగా చెప్పేది. హీరోయిన్స్ అంతా మిమ్మల్నే పొగుడుతారు ఏంటో మరి అని సరదాగా నవ్వేసాడు ప్రభాస్.