Radhe Shyam: 10 వేల థియేటర్లలో రాధేశ్యామ్.. ఏంటి నిజమా?

బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్.. దేశ విదేశాల్లోనూ అభిమానులు సంపాదించుకున్నాడు. ‘సాహో’గా హాలీవుడ్ రేంజ్ సినిమాతో నుంచి అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా..

Radhe Shyam: 10 వేల థియేటర్లలో రాధేశ్యామ్.. ఏంటి నిజమా?

Radheshyam Visual Effects

Radhe Shyam: బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్.. దేశ విదేశాల్లోనూ అభిమానులు సంపాదించుకున్నాడు. ‘సాహో’గా హాలీవుడ్ రేంజ్ సినిమాతో నుంచి అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న ప్రభాస్.. బాలీవుడ్ స్టార్ హీరోలని కూడా దాటేసి ఇండియాలోనే టాప్ లో ఉన్నాడు. టాప్ 50 ఏషియన్ ప్రముఖుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ప్రభాస్ ఇప్పుడు రాబోయే అన్ని సినిమాలను కూడా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడు.

Malavika Mohanan: బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలంటే కండిషన్ పెట్టిన మాళవికా!

ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K సినిమాలను వరసగా పూర్తిచేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇందులో రాధేశ్యామ్ ఇప్పటికే సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. కానీ ఈసారి సమ్మర్ రిలీజ్ ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇవ్వడం పక్కా అంటున్నారు మేకర్స్. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

Vijay Devarakonda: రౌడీ హీరో ఆశలన్నీ లైగర్‌పైనే.. గేమ్ ఛేంజర్ అవుతుందా?

కాగా, ఇప్పుడు రాధేశ్యామ్ రిలీజ్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ తెగ చర్చకి దారితీస్తుంది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే రాధే శ్యామ్ సినిమాని తెలుగు సినిమా చరిత్రలోనే.. ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు బద్దలు కొట్టేలా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పదివేలకి పైగా థియేటర్లలో విడుదల చేయనున్నారట. హాలీవుడ్ సినిమాలకి మాత్రమే ఇప్పటి వరకు ఈ స్థాయి రిలీజ్ ఉండేది. బాలీవుడ్ సినిమాలు కూడా ఇంత భారీ స్థాయిలో విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు తొలిసారి ఓ తెలుగు సినిమాని.. అది కూడా ప్రభాస్ సినిమాని ఈ స్థాయిలో రిలీజ్ చేయనున్నారట.

Telugu Films Shooting: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే..?

ఇదే నిజమైతే ఇందులో బాలీవుడ్ నిర్మాతలకి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే.. రాధేశ్యామ్ సినిమా విడుదల పంపిణీ హక్కులను మూవీ క్రియేషన్స్ ముందుగానే బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలకి అమ్మేసింది. ఆ నిర్మాతలే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు భారీ స్థాయిలో విడుదలకి ప్లాన్ చేసుకున్నారు. కేవలం హిందీ వెర్షన్ ను నాలుగు వేలకు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్దమవడంతో దక్షణాదిలో అంతకి మించి భారీగా థియేటర్లలో వస్తుండడంతో ఈ ఫీట్ సాధ్యమవుతుందట. ఇది నిజమైతే ప్రభాస్ కెరీర్ లోనే ఇది బాహుబలి రిలీజ్ గా చెప్పుకోవచ్చు.